జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!

Header Banner

జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!

  Fri Jun 21, 2024 22:56        Politics

వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్: డయేరియా విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు. మెరుగైన వైద్య సేవల్ని అందించాలి. అధికారుల్ని ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్. జగ్గయ్యపేటలో డయేరియా ప్రబలడం పట్ల మంత్రి ఆరా. గురువారం అర్ధరాత్రి హుటాహుటిన జగ్గయ్యపేటకు పరుగులు తీసిన అధికారులు. మంత్రి ఆదేశాలతో గురువారం రాత్రంతా జగ్గయ్యపేటలోనే ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్వో. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఫోన్లో అడిగి తెలుసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సందర్శించిన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. పరిస్థితి అదుపులో ఉంది, ఆందోళన పడొద్దు:డిఎంహెచ్వో డాక్టర్ సుహాసిని.

 

ఇంకా చదవండి: ఒకే ఒక్క నామినేషన్‌తో! స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన అరుదైన ఘనత!

 

విజయవాడ: జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్  ఆరా తీశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖాధికారి డాక్టర్ యం.సుహాసిని, వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తన బృందంతో ఆయా ప్రాంతాల్లో హూటాహుటిన గురువారం అర్ధరాత్రి సందర్శించారు.  డయేరియా  నివారణా చర్యలు చేపట్టారు. వైద్య శిబిరాన్ని  ఏర్పాటు చేశారు.

అనుమంచిపల్లి , బూదవాడ, జగ్గయ్యపేట టౌన్, షేర్ మహమ్మద్  పేట లకు చెందిన కొంతమంది  విరోచనాలతో బాధపడుతున్నారని, వారు వెంకట సన్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డిఎంహెచ్వో డాక్టర్ సుహాసిని తెలిపారు. వారు కూడా క్షేమంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. ఈ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న  డయేరియా బాధితులు వివిధ ప్రాంతాలకు చెందిన వారని ఆమె తెలిపారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు.

 

ఇంకా చదవండి: ధర రూ.12,000 కే 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా! అదిరిపోయే VIVO T3 లైట్‌ మీ కోసమే!

 

సందర్శించిన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య డయేరియా ప్రబలిన ప్రాంతాల్ని గురువారం రాత్రి  సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రి  సత్య కుమార్ యాదవ్,  ఆరోగ్య కుటుంబ సంక్షేమ  శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్  ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎమ్. సుహాసిని గురువారం రాత్రంతా అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.  వైద్యాధికారి డా.అనిల్ కుమార్. ఎఎన్ ఎం లు,ఆశా కార్యకర్తలు స్థానికంగా వైద్య సేవలందిస్తున్నారు.

 

ఇంకా చదవండి: మత్స్యకారులను చూసి ఆగిన హోంమంత్రి అనిత! అక్కడిక్కడే బాపట్ల ఎస్పీకి ఫోన్!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

సూపర్‌ ఫీచర్లతో Boult క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌! 360 డిగ్రీలు రొటేటింగ్‌, అందుబాటు ధరలు, సేల్ వివరాలు!

 

నీట్ అవకతవకలపై కేంద్రం కీలక చర్య! ప్రతిపక్ష నిరసనలపై మంత్రి స్పందన!

 

IRGCపై కెనడా తీవ్రవాద ట్యాగ్! ఇరాన్ స్పందన తీవ్ర విమర్శలతో!

 

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!

 

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! నలుగురికి శిక్ష తప్పదా!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group


   #JaggaiahpetAlert #DiarrheaOutbreak #HealthEmergency #MinisterSatyaKumar #HealthOfficials #PublicHealthCrisis #ImmediateResponse #HealthcareAlert #APHealth #EmergencyMeasures