రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి! చంద్రబాబుకు యనమల లేఖ!

Header Banner

రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి! చంద్రబాబుకు యనమల లేఖ!

  Tue Jul 02, 2024 16:59        Politics

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తన పరిశీలనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ (ఆర్‌ఆర్‌ యాక్ట్‌) లేదా ప్రత్యేకమైన చట్టంతో రాబట్టాలని సూచించారు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని యనమల కొనియాడారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను ఆయన సూచించారు. ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు తోడ్పాటు ఇవ్వటంతోపాటు రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని ఈ సూచనలు మెరుగుపరుస్తాయని యనమల అభిప్రాయపడ్డారు. 

 

ఇంకా చదవండి: కాకినాడలో డిప్యూటీ సీఎం సమీక్ష! ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలవ్వాలి!

 

సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే బిల్లుల చెల్లింపులు చేయాలి:

పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, సహేతుకమైన స్థిర రుణాలు, ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ తదితర అంశాలపై కేంద్రాన్ని అభ్యర్థించాలని యనమల సిఫార్సు చేశారు. వేస్‌ అండ్ మీన్స్, ఓడీని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఆదాయ వ్యయాల తగ్గించుకోవాలని, సంక్షేమ పథకాలకు అర్హులే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలని, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని యనమల తన లేఖలో పేర్కొన్నారు. సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ద్వారా లోటు ప్రస్తుతం నియంత్రించి.. రాబోయే సంవత్సరాల్లో తగ్గించాలని సూచించారు. బిల్లుల చెల్లింపులు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా మాత్రమే చేయాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సు కోసం అనుకూల వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు ప్రబలంగా ఉన్న అవినీతిని నిర్మూలించాలని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనిక నాయకత్వం, సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని యనమల ఆకాంక్షించారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం! డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్! చివరికి ఏమైందంటే..?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YanamalaRamakrishnudu #letter #Chandrababu