ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం! పవన్ తో తాను అనేక సంవత్సరాలుగా కలిసి..

Header Banner

ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం! పవన్ తో తాను అనేక సంవత్సరాలుగా కలిసి..

  Tue Jul 02, 2024 22:15        Politics

ఇవాళ ఢిల్లీలో జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "ఇవాళ జనసేన ఎంపీలను కలిశాను. పవన్ కల్యాణ్ గారితో నేను అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాను. ప్రజాసేవ పట్ల ఆయన అనురక్తి, దృఢవైఖరి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. సమాజానికి తన వంతు సేవలు అందించడానికి, దేశ ప్రగతికి తోడ్పాటు అందించడానికి జనసేన పార్టీ కచ్చితంగా ముందుంటుందని నాకు గట్టి నమ్మకం" అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, మోదీ ట్వీట్ పై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినమ్రంగా స్పందించారు. "జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను కలిసేందుకు మీ విలువైన సమయం కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధాని మోదీ గారూ. ప్రజా సేవ దిశగా మా ఎంపీలకు మీరు ఇచ్చిన అమూల్యమైన సూచనల నుంచి మా జనసేన నేతలు, శ్రేణులు, నేను ఎంతో నేర్చుకుంటాం. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సర్" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం! డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్! చివరికి ఏమైందంటే..?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

 

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PawanKalyan #NarendraModi #Janasena #NewDelhi #AndhraPradesh