టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Header Banner

టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

  Sun Jul 14, 2024 16:54        Politics

2014 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన చంద్రబాబు.. టిడ్కో ఇళ్లను ఎంతో ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రెండు గదులతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్లలో చాలా ఇళ్లు నిర్మించారు. కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి అయితే 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు రంగులు మార్చింది. ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందజేస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు కసరత్తు చేస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం కొటిపిలో నిర్మాణంలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడ్కో ఇళ్లలోని సామాగ్రి నాశనం చేశారని, ఆరు నెలల్లో వాటిని పూర్తి చేసి పేదలకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 2014 టీడీపీ హయాంలో లేటెస్ట్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను నిర్మించామని, జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నదే టీడీపీ లక్ష్యమని చెప్పారు.

 

ఇవి కూడా చదవండి 

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు! 

 

మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ! 

 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో! 

 

రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!

  

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ! 

    

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #AP #APGovernment #AndhraGovernment #Amaravathi #Hindupur #BalaKrishna