ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

Header Banner

ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

  Mon Jul 15, 2024 16:01        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి పదవులను బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు దక్కించుకున్నారు. ప్రస్తుతం పాలనలో చంద్రబాబు సర్కార్ దూసుకుపోతోంది. ఇప్పుడు నామినేటేడ్ పదవుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం కూటమి అధిష్టానం కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన అధినేతలపై ఒత్తిడి పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తాము సీటు త్యాగం చేశామని, ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో మూడు పార్టీ అధినేతలు తర్జన భర్జన పడుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో నామినేటెడ్ పదవులకు నాయకుల నియామకం ఉంటుందని, కానీ అందరికీ చైర్మన్ పదవి కావాలంటే కష్టతరమన్నారు. కొందరు టీటీడీ పదవులు కావాలని అడుగుతున్నారని, ఒక్క చైర్మన్ పోస్టు ఉంటే 50 మంది వరకూ ఆశావహులు ఉన్నారని తెలిపారు. తన కుటుంబ సభ్యులెవరూ టీటీడీ చైర్మన్ పదవిని అడగలేదని పవన్ స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: రాయలసీమకు మరో శుభవార్త! రూ.4వేల కోట్ల పెట్టుబడితో విన్‌ఫాస్ట్ ఈవీ యూనిట్! ఇక ఉద్యోగులకు కొరత ఉండదు!

 

టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబు అడగలేదని, కాని ప్రచారం జరుగుతోందన్నారు. ఇప్పటివరకూ నాగబాబు ఏ పదవి అడగలేదని స్పష్టం చేశారు. ఇంత కాంపిటేషన్లో నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబును ఏ విధంగా అలా అడగాలో అర్థంకావడంలేదన్నారు. పొత్తు పెట్టుకున్నామని, పదవులు మాకివ్వండని అని తాను పట్టుబట్టలేనన్నారు. కేంద్రంలోకి వస్తే కేంద్రమంత్రి పదవులు ఇస్తామని గతంలోనే అడిగారని, కానీ రాష్ట్రానికి సేవ చేస్తామని కేంద్రపెద్దలకు చెప్పామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి 

అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే! 

 

తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్! నమ్మి దొరికిపోతే మీ అకౌంటులు ఖాళీ! 

 

మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే! 

 

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా! 

 

మంత్రి లోకేష్ చొరవతో కువైట్ ఎడారిలో ప్రవాసుడు! సురక్షితంగా ఎడారి నుండి ఎంబసీకి తరలింపు! బాధితుడి తాజా వీడియో విడుదల కృతజ్ఞతలు తెలుపుతూ! 

 

టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు! 

                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group    


   #AndhraPravasi #Politics #AndhraPradesh #AP #APGovernment #DeputyCM #PSPK #DeputyCMPawanKalyan