ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు!

Header Banner

ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు!

  Tue Jul 16, 2024 16:57        Politics

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇటీవల ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాదు బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమవుతుందని, ప్రస్తుతం డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని పేర్కొన్నారు. కొత్త మంత్రులు తమ శాఖలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, లోటు బడ్జెట్ ఉందని గ్రహించి పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు.

 

ఇవి కూడా చదవండి 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం! 

 

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే! 

 

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

 

అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు! 

 

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు! 

 

విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్! 

                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #CBN #CMCBN #CBNAgain #AP #APGovernment #FreeSand