ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

Header Banner

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

  Tue Jul 16, 2024 20:27        Politics

ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందగా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. తాజాగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని తాజాగా ఒంగోలు వచ్చి కార్యకర్తలతో సమావేశమై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాటల తూటాలు పేల్చారు. ఏం... మేం చేతకానివాళ్లం అనుకుంటున్నావా... చెప్పుతో కొడతాం అంటూ నిన్న ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో, బాలినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘాటుగా స్పందించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరికే వదలం అంటూ హెచ్చరించారు. "జైలుకెళ్లినా రెండ్రోజుల్లో వస్తా, చూస్తా అంటున్నావు... నువ్వేం చూస్తావో మేం కూడా చూస్తాం. నువ్వు (అధికారంలో) ఉన్నప్పుడే పీకలేకపోయావు. ఇప్పుడేం పీకుతావో చూస్తా. కొన్ని మాటలు అనాలంటే సంస్కారం అడ్డొస్తోంది.

 

ఇంకా చదవండి: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణంలో కలకలం! భానుప్రకాష్ ఆగ్రహం

 

వయసులో పెద్దవాడివి. ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు నువ్వు... నీ కొవ్వు దించుతాను. ఏదో గమ్మున ఉంటున్నాం కదా అని రెచ్చిపోతున్నారా? అధికారం అడ్డంపెట్టుకుని నువ్వు, నీ కొడుకు ఎన్ని అరాచకాలు చేశారు? ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేయలేదా? గ్రానైట్ లో డబ్బులు వసూలు చేయలేదా? ఒక్కో బార్లోకి వెళ్లి సీసాకు రూ.10 వసూలు చేయలేదా? వైశ్యులకు చెందిన కమర్షియల్ బిల్డింగ్ లకు డబ్బులు వసూలు చేయలేదా? నాకేం తెలియదు, నా కొడుక్కేం తెలియదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు చేసిన పాపాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. సంస్కారంతో మాట్లాడడం తెలుసుకో. వచ్చావా... కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పావా... అంతవరకే! ఎన్నికల్లో ఓడిపోయాక కార్యకర్తలకు ధైర్యం చెప్పకుండా ఎందుకు పారిపోయావు? కౌంటింగ్ రోజున మాకు ఇంకా సర్టిఫికెట్ ఇవ్వకముందే నువ్వు 4 గంటలకే వెళ్లి హైదరాబాదులో కూర్చున్నావు... నీలాంటి వాడిపై కార్యకర్తల్లో ఏం విశ్వాసం ఉంటుంది? ఇవాళ వచ్చి కార్యకర్తలకు అండగా ఉంటానని ఎలా చెబుతావు?" అంటూ దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు.


ఇంకా చదవండి: టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!

 

ఏపీలో మద్యంతర ఎన్నికలు అంటూ వైసీపీ నేత కామెంట్స్! ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఈ రైళ్లకు అదనపు బోగీలు!

 

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ తమ్ముడు అరెస్ట్! గోవా కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందా!

 

ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని గుర్తించిన FBI! ఐడీ కార్డులు లేకుండా ఎలానో తెలుసా?

 

పైకి చూస్తే పూలతోట.. లోన మాత్రం కథ వేరే! గొప్పోడివయ్యా సామీ! మనోడి తెలివిని చూసిన పోలీసులు షాక్!

 

పిల్లలు సంపాదించే ఆదాయం పరిధిలో వచ్చే నియమాలు ఏంటి? ఆదాయ పన్ను చెల్లించాలా? ఆ వివరాలు మీకోసం!

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్! ఇక నుంచి సులువుగా దర్శనం, గదులు! తిరుపతి దేవస్థానంపై ప్రత్యేక దృష్టి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #DamacharlaJanardhan #BalineniSrinivasaReddy #Ongole #TDP #YSRCP