విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

Header Banner

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

  Wed Jul 17, 2024 07:30        Politics

విద్యాదీవెన, వసతిదీవెన పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు పథకాలను గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రభుత్వం మారటంతో ఈ పథకాల్లో మార్పులు చేస్తారా లేదా కొనసాగిస్తారా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంలో క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని నారా లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో నారా లోకేష్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగానే విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విధివిధానాలను తయారుచేయాలని నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు చెల్లించకపోవటంతో కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఆగిపోయాయని నారా లోకేష్ ఆరోపించారు. ఇదే సమయంలో విద్యాశాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై స్వచ్ఛంద సంస్థల సాయంతో యువతలో అవగాహన కల్పించాలని నారా లోకేష్ సూచించారు. ఈ సమావేశంలోనే కాలేజీలో లెక్చరర్ పోస్టుల భర్తీ విషయం ప్రస్తావనకు రాగా.. న్యాయపరంగా ఉన్న చిక్కులు తొలగించి భర్తీకి కసరత్తు ప్రారంభించాలని నారా లోకేష్ సూచించారు. 

 

ఇంకా చదవండి: ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

 

మరోవైపు గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ప్రభుత్వం నుంచి కాలేజీల ఖాతాల్లోకి ఫీజులు వేసే విధానం ఉండేది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన పథకాలను తీసుకువచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థుల ఫీజులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత విద్యార్థుల తల్లులు వారం, పది రోజుల్లో కాలేజీలకు ఫీజులు చెల్లించాల్సి ఉండేది. ఇక జగనన్న వసతి దీవెన కింద విద్యార్థుల హాస్టల్ ఫీజులను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు. అయితే ఈ విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోనే ఫీజులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇవి కూడా చదవండి 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా! 

 

ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు! 

 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం! 

 

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే! 

 

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

 

అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు! 

 

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు! 

                                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #Education #AndhraPradesh #APGovernment #Students #CBN #CMCBN #NaraLokesh