ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!

Header Banner

ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!

  Wed Jul 17, 2024 13:01        Politics

నాయుడుపేట గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు. ఆహారంలో కలుషితం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని ఆయన వెల్లడించారు. మెుదటగా విద్యార్థులను ఆయన ఆప్యాయంగా పలకరించి.. ప్రస్తుతం ఒంట్లో ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లను కలిసి చిన్నారుల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. ఈ సంఘటన చాలా బాధాకరం, దురదృష్టకరమని మంత్రి డోలా ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: ఆర్థిక మంత్రితో చంద్రబాబు భేటి లేనట్టేనా? జగన్‌ పాలనలో ఆర్థిక నిర్వహణలో తీవ్ర వైఫల్యం!

 

ఫుడ్ పాయిజన్‌ విషయంలో గురుకుల పాఠశాల సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం కనిపిస్తోందని మంత్రి చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా తెలిపారు. సంఘటనపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు ప్రకటిస్తున్నామని, పరిస్థితి అదుపులోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు.


ఇంకా చదవండి: తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో! సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

 

గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!

 

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

 

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా!

 

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

 

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Gudur #School #MinisterDolaVeeranjaneyaSwamy