ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

  Wed Jul 17, 2024 14:49        Politics

అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదనలు అందించారు. కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టకు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. దీంతో, సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అమరావతి కేంద్రంగా సీఆర్డీఏ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్‌ ఎంట్రన్స్‌గా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా మరో రెండు రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానం చేయాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ-11, ఈ-13 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ రెండు రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు. వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి మణిపాల్‌ హాస్పిటల్‌ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగువున ఎన్‌హెచ్‌-16కు కలపాల్సి ఉంది.

 

ఇంకా చదవండి: రోజా కనిపించని చెత్త.. అహంకారం! షాకింగ్ వీడియో వైరల్! చేసిన పనికి జగన్ కు తలనొప్పి!

 

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అమరావతి రాజధానిపై దృష్టి సారించింది. ఉండవల్లి మండలంలోని పెనుమాక దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర 30 ఎకరాల వరకు భూముల అవసరం ఏర్పడింది. సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవటానికి సీఆర్‌డీఏ సిద్ధంగా ఉంది. ఒకవేళ పూలింగ్‌ కింద సాధ్యం కాకపోతే భూ సేకరణ చేసైనా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. త్వరలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు బ్యాలెన్స్‌ పనులకు అడుగులు పడతాయనుకున్న దశలో సీఆర్‌డీఏ దానితోపాటు ఈ-11, ఈ-13 రోడ్లను కూడా ఎన్‌హెచ్‌-16 అనుసంధానించాలని నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి ఓఆర్‌ఆర్‌కు అనేక జాతీయ రహదారులు అనుసంధానమవుతున్నాయి. ఎన్‌హెచ్‌- 16, ఎన్‌హెచ్‌-65, ఎన్‌హెచ్‌-30, ఎన్‌హెచ్‌-216, ఎన్‌హెచ్‌-216 హెచ్‌ ఇలా ఎన్నో రోడ్లు ఇందులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైన నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌, బెంగళూరు-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌లు అనుసంధానం కానున్నాయి. దీని కారణంగా రాజధానికి విస్తృతమై రోడ్డు నెట్‌వర్క్‌తో గేమ్ ఛేంజర్ కానుంది.


ఇంకా చదవండి: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

 

గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!

 

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

 

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా!

 

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

 

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Delhi #NewRoad #APpolitics #Chandrababu #Amaravati