ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

Header Banner

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

  Tue Aug 13, 2024 07:00        Politics

కీలక పదవుల భర్తీ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో చర్చించారు. కొన్ని ముఖ్యమైన పదవుల భర్తీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం లో టీడీపీ భాగస్వామిగా ఉంది. దీంతో..ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఎవరికి అవకాశం ఇస్తారనేది కీలకంగా మారుతోంది. నలుగురు ముఖ్యులు పోటీ పడుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని నలుగురు ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. ఈ నలుగురికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని కోరినట్లు సమాచారం. ఏపీ సమస్యల పైన అవగాహన.. బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు సుజనాకు కలిసి వస్తాయని భావిస్తున్నారు.

 

ఇంకా చదవండి: విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి ఖరారు! నేడు చంద్రబాబు ప్రకటన! ఆయన ఎవరంటే!

 

రెండు సార్లు గుంటూరు ఎంపిగా పని చేసి, జగన్‌ ప్రభుత్వం వేధింపులతో వ్యాపారపరంగా నష్టపోయి, ఎన్నికల్లో ఎంపి సీటును త్యాగం చేసిన తనకు ఢిల్లీ ప్రతినిధి పదవి ఇవ్వాలని గల్లా జయదేవ్‌ అంటున్నారు. ఎంపిగా చేసిన తనకు ఢిల్లీలో బిజెపి నేతలతో సత్సంబంధాలున్నాయని, ఒక విధంగా బిజెపి- టీడీపీ పొత్తుకు ఢిల్లీలో కృషి చేశానని, జగన్‌ ప్రభుత్వ కక్ష సాధింపులను ఎదుర్కొన్నానని, ఎంపి సీటును వదలుకొని ఎంఎల్‌ఎ అయ్యానని, అందుకే తనకు ఢిల్లీ ప్రతినిధిగా అవకాశం ఇవ్వాలని రఘురామ కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పని చేసిన అనుభవం ఉన్న కంభంపాటి తనకు ఈ పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. బిజెపితో, కాంగ్రెస్‌, ఇతర అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలుండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఈ పదవిపై ఆచి తూచి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన వేళ ఏపీ అధికార ప్రతినిధి పాత్ర కీలకంగా మారనుంది. దీంతో, చంద్రబాబు చివరగా ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance