ఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్!
Tue Sep 17, 2024 08:52 Politicsఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు గనులశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్, యాప్ను అధికారులు సిద్ధం చేశారు. వివిధ శాఖలకు చెందిన అన్ని జిల్లాల ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 11న ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, విజయవాడలోని వరద సహాయ కార్యక్రమాల్లో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా, సంచాలకులు ప్రవీణ్కుమార్ బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదు. ఈ నెల 18న మంత్రిమండలి సమావేశం జరగనుంది. తర్వాత రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మేరకు గనులశాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇసుక డోర్ డెలివరీకి రవాణా ఛార్జీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు
వచ్చే నెల నుంచి నదుల్లోని రీచ్ల్లో తవ్వకాలు మొదలుకానున్నాయి. దీంతో ఉచిత ఇసుక దారి మళ్లకుండా, ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరే ఇందులోని అధికారులను నియమిస్తారు. గనులశాఖ, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల, భూగర్భజలవనరులు.. తదితర శాఖల అధికారులతో కూడిన బృందం విస్తృతంగా తనిఖీలు చేయనుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!
రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!
ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!
ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...
ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్!
ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!
కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!
జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #sand #online #booking #door #delivery #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.