చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

Header Banner

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

  Wed Sep 18, 2024 09:00        Politics

వైఎస్ జగన్ హయాంలో ఉన్నత విద్యా వ్యవస్థ- ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొందో తెలియజెప్పే ఉదంతం ఇది. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దామంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పుకొన్నప్పటికీ.. ఉన్నత చదువులు మాత్రం ఆ స్థాయిలో సాగలేదని స్పష్టం చేసే ఘటన ఇది. ప్రభుత్వ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాల మాట అటుంచితే కనీసం ల్యాబొరేటరీలు కూడా అందుబాటులో ఉండకుండా పోయాయి. అయినప్పటికీ- కెమిస్ట్రీ విద్యార్థులు పైతరగతులకు ఎలా ప్రమోట్ కాగలిగారనేది అర్థం కాని విషయం. ఇది- 2016లో బిహార్ పాఠశాల విద్య పరీక్షల కుంభకోణానికి ఏ మాత్రం తీసిపోదనే అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల పనితీరు ఎంత అధ్వాన్నంగా తయారయ్యాయనే విషయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం శాసన సభ్యురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కళ్లకు కట్టినట్టు వివరించారు. వన్ ఇండియాకు ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ- పైతరగతులకు వెళ్లాలంటే కెమిస్ట్రీ స్టూడెంట్స్‌కు కాలేజీల్లో ల్యాబొరేటరీలు అత్యవసరం. ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణులు కావాలంటే ల్యాబ్స్‌లో ప్రయోగాలు చేసి తీరాల్సిందే. ఆళ్లగడ్డ ప్రభుత్వ కాలేజీలో మాత్రం అలాంటి సౌకర్యమే లేదు. అసలు ల్యాబొరేటరీలే లేవు. అయినా స్టూడెంట్స్ మాత్రం ప్రతి సంవత్సరం ప్రమోట్ అవుతూనే వస్తోన్నారు. ఇదెలా సాధ్యం?.. అని ప్రశ్నించారు. ఆమె సంధించిన ఈ ప్రశ్న- ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దుమారం రేపుతోంది. చర్చనీయాంశమైంది.

 

ఇంకా చదవండి: ఫేక్ జగన్ నువ్వు మారవు... నీ ఫేక్ మూకలు అస్సలు మారరు! లోకేష్ వార్నింగ్ సోషల్ మీడియాలో హల్ చల్!

 

తన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేయించుకున్నానంటూ వైసీపీ మాజీ శాసన సభ్యుడు గొప్పలు చెప్పుకొన్నప్పటికీ ఉపయోగం ఏముందని అఖిలప్రియ ప్రశ్నించారు. వందేళ్ల కిందట కట్టిన ఓ పాత భవనంలో జూనియర్ కాలేజీ కొనసాగుతోందని, అది కూడా ఓ మహిళ దీన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో కూడా డిగ్రీ కాలేజీ ఉందని ఏదో చెప్పుకోవడానికే తప్ప ఎలాంటి మౌలిక సదుపాయాలను కూడా మాజీ వైసీపీ ఎమ్మెల్యే కల్పించలేకపోయారని అఖిలప్రియ విమర్శించారు. ఈ కాలేజీకి కొత్త బిల్డింగ్ లేదు. సరైన మౌలిక సదుపాయాలు గానీ, వాష్ రూమ్స్ గానీ లేవు. బోధన సిబ్బంది కాదుకదా కనీసం స్వీపర్ కూడా లేడు. స్టూడెంట్సే తమ తరగతి గదులను తామే శుభ్రం చేసుకుంటారు. వర్షం వస్తే విద్యార్థులు తడిచి ముద్ద కావాల్సిందే. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చూరుకారుతుంటాయి.. అని అఖిలప్రియా వివరించారు. క్యాంపస్ అంతా కూడా ఓ భూత్ బంగ్లాలా కనిపిస్తుంటుందని ఆమె ఆరోపించారు. అలాంటి పాత భవనంలో స్టూడెంట్స్‌ను చేర్పించడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్‌లాగే తన వద్ద కూడా ఓ రెడ్ బుక్‌ ఉందని. తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టినవారి పేర్లు వందకు పైగా అందులో ఉన్నాయంటూ గతంలో చేసిన హెచ్చరికలపై అఖిల ప్రియా స్పందించారు. రాజకీయ కక్షతో, చట్ట విరుద్ధంగా తనపై కేసులు బనాయించిన వాళ్లకే ఈ రెడ్ బుక్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని వాళ్లు ఈ రెడ్ బుక్‌ను చూసి భయపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. తమ బిగ్ బాస్‌ను సంతోష పెట్టడానికి చట్టాన్ని ఉల్లంఘించిన వారందరూ శిక్ష తప్పదని పునరుద్ఘాటించారు.

ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu