ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

Header Banner

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

  Sun Sep 22, 2024 16:09        Politics

ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా మద్యం దుకాణాలను వైఎస్ జగన్ ప్రభుత్వమే నిర్వహించింది. ఆ సమయంలో జాతీయంగా, అంతర్జాతీయంగా పేరెన్నికగన్న బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురాలేదు. స్థానికంగా తయారయ్యే మద్యాన్ని సరఫరా చేయడంతో దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ మందుబాబులు ఆందోళన చేసేవారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో మందుబాబుల పంట పండింది. ఇకనుంచి మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తులద్వారానే నిర్వహింపచేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం ఏపీలో ఇకనుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ ఇంపీరియల్ బ్లూ, మెక్ డొవెల్స్ లాంటి బ్రాండ్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న రాయల్ ఛాలెంజ్, జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, వోడ్కా, బ్లాక్ డాగ్ లాంటివన్నీ ఏపీలోని మద్యంలో షాపుల్లో విక్రయించనున్నారు. వచ్చేనెల ఒకటోతేదీ నుంచి నూతన మద్యం విధానం తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 10 శాతం మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే లిక్కర్ విధానం మారుస్తామని ప్రకటించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మద్యం విధానాన్ని సంపూర్ణంగా మార్చేశారు.

 

ఇంకా చదవండి: సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ! బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం!

 

గతంలో బ్రాండెడ్ మద్యం దొరక్క తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి మరీ మందుబాబులు కొనుగోలు చేసుకొని తెచ్చేవారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించి వీటిని ఎక్స్ జ్ శాఖ స్వాధీనం చేసుకునేది. ఆయాన రాష్ట్రాలకు సరిహద్దుల్లో నివసించేవారు మాత్రం రోజు ద్విచక్రవాహనాలపై వెళ్లి తమకు కావల్సిన బ్రాండ్లు తెచ్చుకునేవారు. కొంతమంది హైదరాబాద్ నుంచి గుంటూరు రైలు ద్వారా బ్రాండెడ్ మద్యాన్ని సరఫరా చేసేవారు. సికింద్రాబాద్ లో కొందరు వ్యక్తులు ఒక సీటు నెంబరు పేరు గుంటూరులో ఉన్నవారికి చెప్పి ఆ సీటు కింద సరుకు ఉంచేవారు. గుంటూరులో సంబంధిత వ్యక్తులు వచ్చి ఆ సీటుకింద ఉన్న బాక్సులను తీసుకువెళ్లేవారు. ఎవరికీ అనుమానం రాకుండా చేసినప్పటికీ చివరకు దొరికిపోవడంతో కటకటాలపాలయ్యారు. కాగా, గతంలో ఏపీలో నాసిరకం బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మందుబాబులు పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్రమంగా మద్యం తెచ్చుకునేవారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ తెచ్చుకునేవారు. ఇక నుంచి వారికి ఆ ఇబ్బందులు ఉండవు. ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు ఏపీలోనే అందుబాటులోకి రానున్నాయి.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu