వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

Header Banner

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

  Mon Oct 07, 2024 07:00        Politics

ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చింది. వారికి గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారిని విధుల్లో కొనసాగిస్తామని, ఎవ్వరూ రాజీనామా చేయవద్దని హామీ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా సరే వారికి జీతాలు పెరగలేదు. వారికి అందిచాల్సిన వేతనాలు కూడా అందించడంలేదు. సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ వారికి త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తాము, ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటామని చెబుతునే వస్తున్నారు. గత వైసీపీ సర్కార్ వాలంటీర్ల సాయంతోనే అన్ని పథకాలను ప్రజలకు చేరవేసేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, వాలంటీర్లు కీలకంగా వ్యవహరించిన పెన్షన్ల పంపిణీలో కూడా వారికి పాత్ర శూన్యంగా మారింది.

 

ఇంకా చదవండి: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! ఇరువురి మధ్య అరగంట పాటు సమావేశం!

 

దీనికి కారణం ఏంటంటే? చాలా మంది వాలంటీర్లు వైసీపీ నేతల మాటలకు, ప్రలోభాలకు ఆశపడి వారి విధులకు రాజీనామా చేశారు. అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో వారిని తిరిగి కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు అమలు చేస్తున్న యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాల‌ని, తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ వర్తింపజేయాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలే నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తామని అన్నారు. దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినేట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వారికి సంబంధించి మంత్రి వర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులకు కేటాయించాలనే దానిపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా వారికి అందిస్తామని హామీ ఇచ్చిన గౌరవం వేతనం రూ.10వేలపైన కూడా సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. వారికి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్స్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం దిపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంతో పాటుగా వాలంటీర్లకు గౌరవం వేతనం రూ.10వేలకు పెంచి వారికి తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. వారికి అందాల్సిన నాలుగు నెలల గౌరవ వేతనం కూడా ఒకేసారి అందించే ఆలోచనలను ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు ఈ కేబినెట్ భేటిలో పలు కీలక విషయాలను మంత్రివర్గం చర్చించనుంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance