ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

Header Banner

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

  Tue Oct 08, 2024 08:59        Politics

ఢిల్లీలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాజధాని నగరం అమరావతికి మద్దతు ఇస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు వివరించారు.

 

ఇంకా చదవండి: మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీకి సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను ముందుకు తీసుకెళుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు. కొత్త రైల్వే జోన్ కు డిసెంబరులో పునాది రాయి పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనుల చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి తెలిపారని చంద్రబాబు వెల్లడించారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance