సచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Header Banner

సచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

  Wed Oct 09, 2024 09:06        Politics

అస్తవ్యస్తంగా ఉన్న సచివాలయాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామ సచివాలయాలను పంచాయతీలతో అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించింది. రెండోదశలో పంచాయతీకో సచివాలయం ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ తీవ్ర గందరగోళంగా తయారైంది. వాటిలో పని చేసే ఉద్యోగులు ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. జీతాలిచ్చేదొకరు, పని చేయాలని ఆదేశించేది ఇంకొకరు. హాజరు చూసేది మరొకరు. పని తీరును విశ్లేషించేది వేరొకరు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ప్రధాన లక్ష్యమన్నట్లుగా సచివాలయాలను ప్రారంభించింది తప్పితే వీటి నిర్వహణకు వైకాపా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవస్థను వైకాపా సర్పంచులు సైతం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీల పరిధిలో సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిపై సర్పంచులకు ఎలాంటి అధికారాలు లేకుండా 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని గత ప్రభుత్వం దెబ్బ తీసిందని మండిపడుతున్నారు. గత సర్కారు రాష్ట్ర స్థాయిలో సచివాలయాల శాఖను ఏర్పాటు చేసి పంచాయతీలకు సచివాలయాలతో సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించింది. ఒక్కో గ్రామ సచివాలయంలో నియమించిన 11 మంది ఉద్యోగుల పైనా సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేవు. సచివాలయాల్లో అందించే పౌర సేవలు, హార్డ్వేర్ నిర్వహణ వరకే సచివాలయాల శాఖ చూస్తోంది. ఉద్యోగులు వేర్వేరు శాఖల ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. ప్రతి నెలా జీతాల బిల్లు పెట్టే వరకే పంచాయతీ కార్యదర్శులను పరిమితం చేశారు. అత్యధిక చోట్ల కార్యదర్శుల మాట ఉద్యోగులు వినడం లేదు. రోజూ ఎక్కడికి వెళుతున్నారో సరిగా చెప్పరు. తమ శాఖ అధికారులు అప్పగించిన పనుల్లో ఉన్నామని కొందరు చెబుతుంటారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ, ప్రభుత్వం అప్పగించే వివిధ రకాల సర్వేల నిర్వహణతో డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు (డీఎల్డీవో), మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో) సరిపెట్టుకుంటున్నారు.



ఇంకా చదవండిమరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ! 



ప్రక్షాళన ఇలా..
సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేని గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో అనుసంధానించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. సర్పంచులు సైతం ఇదే విధమైన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుసంధాన ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కొద్దిరోజుల క్రితం ప్రారంభించింది. సచివాలయాలపై సర్పంచులకూ కొన్ని అధికారాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. డీడీవోగా ఉంటున్న పంచాయతీ కార్యదర్శులకూ పర్యవేక్షణ బాధ్యత అప్పగించే అవకాశాలున్నాయి.
పంచాయతీకో సచివాలయం ఉండేలా రెండోదశలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని పంచాయతీల్లో ప్రస్తుతం రెండు నుంచి మూడు సచివాలయాలూ ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగులకు పని లేకుండాపోతోంది. మానవ వనరులు వృథా అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా పంచాయతీకి ఒక సచివాలయం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సచివాలయాల ఉద్యోగుల సంఖ్యను తగ్గించే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. మిగిలిన ఉద్యోగులను వారి సొంత శాఖలకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.
10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  

 


   #andhrapravasi #sachivalayam #panchayathi #system #change #modifications #development #newchange #todaynews #flashnews #latestupdate