రోజా ట్వీట్.. పవన్ కల్యాణ్ రిప్లై! ఈ లైంగిక దాడి ఘటనను ప్రతి ఒక్కరూ!
Wed Oct 09, 2024 17:31 Politicsపిఠాపురంలో ఓ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ విషయమై మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. "పవన్ కల్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. అంటూ ట్వీట్ చేసిన మాజీ మంత్రి.. దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి స్వామి" అంటూ దుయ్యబట్టారు. దీంతో రోజా ట్వీట్‌పై జనసేనాని స్పందించారు. పిఠాపురానికి చెందిన బాలికపై మాధవరం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్పిన పవన్.. ఈ లైంగిక దాడి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవల కోసం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పవన్ తెలిపారు. అలాగే బాధిత బాలికను అన్ని విధాల ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..
మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!
పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!
విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!
లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?
వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!
చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.