రేపు ఏపీ కేబినెట్ భేటీ! ముఖ్యంగా ఆ అంశాలపై చర్చ!

Header Banner

రేపు ఏపీ కేబినెట్ భేటీ! ముఖ్యంగా ఆ అంశాలపై చర్చ!

  Wed Oct 09, 2024 20:52        Politics

ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో వివిధ ప్రతిపాదనలు, కీలక అంశాలపై రాష్ట్రమంత్రివర్గం చర్చించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇటీవలే రాష్ట్రంలో చెత్తపన్నును రద్దుచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కూడా కేబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనుంది.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

దేవాలయాల పాలక మండళ్లను 15 నుంచి 17 మందికి పెంచడం, పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులుండేలా సభ్యుల్ని నియమించడం వంటి ప్రతిపాదనలపై రాష్ట్రమంత్రివర్గం చర్చించనుంది. అలాగే దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల కంటే అధికంగా ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో 17 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ముఖ్యంగా పాలకమండళ్ల నియామకంలో చట్టసవరణకై వచ్చే ప్రతిపాదన పై కేబినెట్ కీలకంగా చర్చించనుంది.

 

ఇంకా చదవండిసచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

అసెంబ్లీ నిర్వహణ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరునెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అదేవిధంగా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP