మంత్రివర్గ భేటీ - వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం! దీపావళి నాడు ఈ పథకం అమలు!

Header Banner

మంత్రివర్గ భేటీ - వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం! దీపావళి నాడు ఈ పథకం అమలు!

  Wed Oct 16, 2024 16:28        Politics

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. అభివృద్ధి - సంక్షేమ రంగాలకు సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీలను ఈ సమావేశంలో ఆమోదించనుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల అంశంతో పాటుగా అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలు పైన మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల పై తేల్చేస్తారా ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా ప్రతీ ఇంటికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధి విధానాలను ఈ రోజు సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీపావళి నాడు ఈ పథకం అమలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక..వాలంటీర్ల అంశం పైన ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ.. వేతనాల చెల్లింపు.. ఎంత సంఖ్య మేర వాలంటీర్ల సేవలు కొనసాగించాలనే అంశాల పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. నూతన పాలసీలు ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టబడులు.. ఉపాధి కల్పన కోసం కొత్త పాలసీలను నేటి మంత్రివర్గంలో ఆమోదం తెలపనుంది. చెత్త పన్ను రద్దు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

 

ఇంకా చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక! డీఏ పెంపు!

 

వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ అంశం పైన చర్చించనున్నారు. బాధితుల పైన భారం లేకుండా వారికి రుణాల రీ షెడ్యూల్ వేళ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. పథకాల అమలు ఆలయ పాలకవర్గాల్లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం బాధ్యతల స్వీకరణ తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు. ఓట్ ఆన్ ఎకౌంట్ ద్వారా నెట్టుకొస్తున్నారు. దీంతో, బడ్జెట్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో మరో ఎన్నికల హామీ అమ్మకు వందనం పైన అధికారులు నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని తొలుత భావించినా... అంతకు ముందే అమలు పైన నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! అలా చేస్తే ప్రభుత్వానికి భారీగా..! ఇక తగ్గేదే లేదు అని అంటున్న అధికారులు!

 

వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!

 

48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!

 

ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప‌థ‌కం!

 

ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!

 

155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!

 

జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!

 

ఏపీలో లిక్కర్ టెండర్ల కిక్కు.. మహిళలు ఎన్ని షాపులు దక్కించుకున్నారో తెలుసా? అందరి సమక్షంలో, సీసీ కెమెరాల నిఘాలో లక్కీ డ్రా!

 

ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

 

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu