వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

Header Banner

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

  Sun Nov 24, 2024 15:00        Politics

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో పలువురు వైసీపీ ముఖ్యులకు నోటీసులు జారీ చేసారు. కొందరిని అరెస్ట్ చేసారు. తాజాగా పులివెందుల కు చెందిన వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు అర్జున్‌రెడ్డికి పోలీసులు 41-ఏ నోటీసులు జారీ చేసారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ కేసులో సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డిని రేపు (సోమవారం) విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసారు. వీరితో పాటు మరికొంత మంది వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..వారిని సైతం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వర్రా రవీందర్ రెడ్డి అసభ్య పోస్టింగ్స్ చేసారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి విచారణ సమయంలో పలువురి వైసీపీ ముఖ్య నేతల పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో , ప్రస్తుతం పోలీసులు వారిని విచారణ కు రావాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో A1గా వర్రా రవీందర్‌రెడ్డి, A2గా సజ్జల భార్గవరెడ్డి, A3 అర్జున్‌రెడ్డిల పేర్లు చేర్చారు. అయితే ఇప్పటికే వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌ మీద కడప జైలుకు తరలించారు.

 

ఇంకా చదవండి: క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

ఇక, ఇప్పుడు భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ వెళ్లిన పోలీసులు ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో సజ్జల భార్గవ్‌ తల్లికి నోటీసులు అందజేశారు. అదే సమయంలో అర్జున్‌రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీరిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో సజ్జల భార్గవ్ రెడ్డి కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. తాజా కేసులో ఆయన్ను విచారించి అరెస్ట్ చేయాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సజ్జల భార్గవ్ రెడ్డి 2022 లో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాతనే సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల పైన భార్గవ్ సూచనల మేరకే పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పటంతో వీరి పైన పోలీసులు ఫోకస్ చేసారు. తాజా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న నమోదైన ఐటీ, బీఎన్ఎస్, అట్రాసిటీ యాక్ట్ కింద ఈ ముగ్గురుపైన కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్‌రెడ్డి పైన కడప జిల్లాలో పది కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. దీంతో, వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూసిన భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YCP #AndhraPradesh #Meeting #money #APpeoples #JaganMeeting #YCPMosum