విజయవాడ వరదలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం స్పందించాలి! పార్లమెంటులో చర్చ కోరిన తెదేపా నేతలు!

Header Banner

విజయవాడ వరదలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం స్పందించాలి! పార్లమెంటులో చర్చ కోరిన తెదేపా నేతలు!

  Sun Nov 24, 2024 17:11        Politics

ఏపీకి సంబంధించిన పలు అంశాలపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్  శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం దిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. "పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంపై సభలో చర్చించాలని కోరాం. ఆయిల్ రిఫైనరీ, కడప స్టీల్స్టాంట్తో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన పెండింగ్ సంస్థల గురించి వెల్లడించాలని కోరాం. విజయవాడకు వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, దానికి సంబంధించిన నిధుల వినియోగంపై చర్చించాలని ప్రస్తావించాం.
గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై అడుగులు ముందుకు పడలేదు. ఇది పూర్తిచేస్తే సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందుకే నదుల అనుసంధానంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని.. దీనికోసం కఠిన చట్టం తేవాలని కోరాం. విదేశాలకు వలస వెళ్లే ఎంతోమంది అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వారికోసం చట్టం తీసుకురావాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం” అని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #parliment #meetings #union #pendingprojects #todaynews #flashnews #latestupdate