చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

Header Banner

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

  Sat Dec 28, 2024 20:02        Politics

ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు పచ్చజెండా ఊపారు. ఇందుకు రూ.60 కోట్ల వ్యయం కానుంది. 108 డ్రైవర్లకు జీతంతో పాటు అదనంగా రూ.4 వేలు ఇచ్చే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. పేదలు ఆసుపత్రుల్లో చనిపోతే వారి మృతదేహాలను తరలించే మహాప్రస్థానం వాహనాల సంఖ్యను మరింత పెంచేందుకు ఆమోదం తెలిపారు. ఇక, ఎన్టీఆర్ బీమా విధానంలో రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించే పథకం అమలు చేయాలన్న ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రస్తుతానికి ట్రస్టు విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని బీమా విధానంగా మలిచేందుకు ఉన్న అవకాశాలపై నేటి సమీక్షలో చర్చించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు 104 అంబులెన్స్ ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ అంబులెన్స్ ల్లో ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించి, పలు రకాల వైద్య పరీక్షలు చేసే సౌకర్యాన్ని మళ్లీ కల్పించాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించినట్టు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

అదే సమయంలో... 108, 104, ఎన్టీఆర్ బీమా పథకం సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చనుంది. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నేటి సమీక్షలో అధికారులతో చర్చించారు. ఇక, ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై శ్రద్ధ చూపించాలని, 104 వాహనాల ద్వారా రక్త పరీక్షలు, ఇతర సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వమే ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి హెల్త్ కార్డులు ఇచ్చే విధానం తీసుకువస్తే మంచి ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో ఏఐ సాంకేతికత సేవలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా, టెక్నాలజీ ద్వారా వైద్య సాయం పొందే విధానం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews