ఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

Header Banner

ఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

  Sat Jan 11, 2025 07:00        Politics

తిరుపతిలో తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భక్తులను పరామర్శించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరామర్శకు ముందు ఆసుపత్రిలో బాధితులకు నగదు కవర్లు ఇచ్చి.. సీఎం చంద్రబాబును తిట్టాలని చెప్పారని మండిపడ్డారు. క్షతగాత్రులకు నగదు కవర్లు ఇస్తున్న దృశ్యాలు.. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని చెప్పారు. పరామర్శ పేరుతో వైఎస్ జగన్ దుష్టచతుష్టయ యాత్ర చేశారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ని భ్రష్టు పట్టించిన ఆ నలుగురే.. గురువారం వైఎస్ జగన్‌ వెంట ఉన్నారని గుర్తు చేశారు. జగన్ వెంట ఉన్న దుష్టచతుష్టయంలో ఒకరు... ఆయన కంటే ముందే ఆసుపత్రిలోకి వెళ్లారని తెలిపారు.

 

ఇంకా చదవండి: విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

ఆసుపత్రిలో బాధితులకు నగదు కవర్లు ఇచ్చి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని వారికి సూచించారన్నారు. పరామర్శకు వెళ్లి.. ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయాలంటూ నగదు కవర్లు ఇచ్చి వస్తారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నగదు కవర్లు ఇచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పడం.. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది సైతం గుర్తించారని మంత్రి ఆనం వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా మంత్రి ఆనం గుర్తు చేశారు. అలాగే వారికి వైకుంఠ ఏకాదశి రోజు.. దైవదర్శనం కల్పించాలని తమకు సూచించారన్నారు. ఇక తన అభిమానులు నినాదాలు చేస్తుంటే.. డిప్యూటీ సీఎం పవన్‌ ఎంతో సంస్కారవంతంగా వారిని కంట్రోల్‌ చేశారని వివరించారు. కానీ వైఎస్ జగన్‌‌‌తోపాటు వందల మందితో ఐసీయూలోకి వెళ్లారని తెలిపారు.

 

ఇంకా చదవండి: ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

బాధితులకు అందిస్తున్న సెలైన్‌ బాటిళ్లనూ సైతం లాగేశారని విమర్శించారు. బాధితులను పరామర్శించాలని వైఎస్ జగన్‌ ఆసుపత్రికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం రాజకీయం చేయాలనే వచ్చారంటు వైఎస్ జగన్‌‌పై మంత్రి ఆనం నిప్పులు చెరిగారు. జగన్‌ వచ్చే సరికి ఆస్పత్రిలో 18 మంది బాధితులు ఉన్నారని.. వారికి తెల్ల కవర్లు పంచారని తెలిపారు. వైఎస్ జగన్‌కు ఇంకా అధికార దాహం తీరలేదని విమర్శించారు. రాజకీయాలకు వైఎస్ జగన్‌ అనర్హుడని ప్రకటించారు. వైఎస్ జగన్‌ గురించి బొత్సకు ఇంకా అవగాహన వచ్చినట్లు లేదని మంత్రి ఆనం వ్యంగ్యంగా అన్నారు. అసలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ మాజీ మంత్రి బొత్సకి ఆయన సూచించారు. అయినా.. బొత్స ఇంత దిగజారి మాట్లాడుతారని అనుకోలేదన్నారు. దేవాదాయ శాఖను పటిష్టం చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #YSRCP #Dastagiri #Pulivendula #Nomination