ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

Header Banner

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

  Sat Jan 11, 2025 09:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మరో కార్యక్రమం పేరును టీడీపీ కూటమి సర్కారు మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ జగనన్న కాలనీల పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలు పేరును ‘పీఎంఏవై-ఎన్టీఆర్‌’ నగర్‌గా మార్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న కాలనీల పేర్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన - ఎన్టీఆర్ నగర్‌గా మార్చారు. ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను కేంద్రం అందించే నిధులతో పాటు రాష్ట్ర వాటాను కలిపి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాల పేర్లను మార్చారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పలు పథకాల పేర్లలో మార్పులు చేశారు. స్వాతంత్రోద్యమ నాయకులు, సంఘ సంస్కర్తల పేర్లను పెట్టారు.

 

ఇంకా చదవండి: నచ్చకపోతే ఐదేళ్ల తర్వాత నన్ను వదిలేయండి - పవన్ కల్యాణ్! ప్రతి జిల్లాకు పర్యటనలు ప్రారంభం!

 

ఈ క్రమంలోనే జగనన్న కాలనీల పేర్లను కూడా పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్‌లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా ఏపీ ప్రభుత్వం మార్చింది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్రగా మార్చారు.జగనన్న గోరుముద్ద పేరిట అందించే మధ్యాహ్న భోజనం పథకాన్ని ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్చారు. అలాగే వైసీపీ హయాంలో ప్రారంభించిన మన బడి - నాడు నేడు కార్యక్రమాన్ని ‘మన బడి - మన భవిష్యత్తు’ అని నామకరణం చేశారు, స్వేచ్ఛ పథకాన్ని ‘బాలికా రక్ష’గా జగనన్న ఆణిముత్యాలును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా టీడీపీ కూటమి సర్కారు మార్చింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పులు చేశారు. ఇక తాజాగా జగనన్న కాలనీల పేరును పీఎంఏవై-ఎన్టీఆర్‌’ నగర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews