వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

Header Banner

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

  Thu Jan 16, 2025 07:00        Politics

పండుగ వేళ మంత్రి నారా లోకేష్ సంచలన కామెంటగ్స్ చేశారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఉద్ఘాటించారు మంత్రి. రెడ్ బుక్‌ను మర్చిపోలేదని, తన పని చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు చంద్రగిరి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి లోకేష్.. త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫీడ్ బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్.. ఇలా తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. టర్మ్ లిమిట్స్ ఉండాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 3వసారి కొనసాగుతున్నానని లోకేష్ గుర్తు చేశారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పొలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30శాతం కొత్తవారు రావాలని.. అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందన్నారు. అహర్నిశలు పాటుపడ్డవారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఫీల్డ్‌లో ఏం జరుగుతుందో ఎప్పటిప్పుడు తెలుసుకుంటామన్నారు.

 

ఇంకా చదవండి: కేటీఆర్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ - ఇక అరెస్టు తప్పదా.. ఫార్ములా ఈ రేసు కేసులో..

 

1994 తర్వాత టిడిపి గెలవని నియోజకవర్గం చంద్రగిరి అని.. ఈ సారి మాత్రం భారీ మెజారిటీతో గెలిచామని పార్టీ శ్రేణులను అభినందించారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వంలో ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారన్నారు. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలను విజయవంతం చేశారన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు ఇచ్చారన్నారు. భారీ మెజారిటీతో గెలిచాం కదా అని తప్పులు చేయొద్దని పార్టీ కేడర్‌కు లోకేష్ హితవు చెప్పారు. ‘మనమంతా ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి. ప్రజలు ఆశతో మనవైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ‘యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. తప్పు చేసిన ఎవరినీ వదలే ప్రసక్తిలేదు. అనవసరంగా కేసులు పెట్టడం మన విధానం కాదు. సోషల్ మీడియా చూసి మీరు కంగారుపడి నన్ను కంగారుపెట్టొద్దు. తిరుపతి పార్లమెంటు పరిధిలో దొంగఓట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టం. ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో పార్టీ కేడర్ అంతా భాగస్వాములు కావాలి. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేస్తున్నాం. కొంతమంది ఆవేశంతో మాట్లాడినా ఓర్పుగా ఉండాలి. ఆవేశపడితే రాష్ట్రం, ప్రజలు నష్టపోతారు. ఈ అయిదేళ్లు ఓపికగా, సంయమనంతో రాష్ట్రాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీచేస్తాం. ఎఎంసిలను కూడా త్వరలో నియమిస్తాం. సీనియర్లు, జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తాం. పనిచేసేవాళ్లను గౌరవిస్తాం. గతంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, సభత్వనమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కేడర్‌కు గుర్తింపునిస్తాం.’ అని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ చెప్పారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఫోన్ సర్వీస్‌కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! డేటా రక్షణపై కీలక సూచనలు!

 

ఎస్‌బీఐ కీలక ప్రకటన! లోన్లపై కొత్త వడ్డీ రేట్లు! ఇవాళ్టి నుంచే అమల్లోకి!

 

ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!

 

గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..

 

వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

 

మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

 

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting