అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

Header Banner

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

  Thu Jan 16, 2025 09:06        Politics

దేశంలో ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. బ్యాంకుల పేర్లతో మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల దగ్గర లక్షల రూపాయలు కాజేయడం వంటి ఘటనలు రోజూ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పండగ ఆఫర్స్ అంటూ కొందరు, ప్రభుత్వ పథకాలంటూ ఇంకొందరు అమాయక ప్రజలకు ఆశ చూపి డబ్బు దోచేస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు అందనున్నాయంటూ వాట్సాప్ మెసేజ్ చేసి బురిడీ కొట్టించిన ఉదంతం హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్ లో పీఎం కిసాన్ డబ్బు పడ్డాయని పేర్కొంటూ హైదరాబాద్ లోని ఓ వ్యక్తికి వాట్సాప్ మెస్సేజ్ వచ్చింది. దీంతో అతను తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని కూడా షేర్ చేశాడు. ఇంకేముంది క్షణాల్లో అతని అకౌంట్‌ నుంచి 1.9 లక్షలు మాయమయ్యాయి. చివరకు మోసపోయాయని తెలుసుకున్న బాధితుడు, రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను ఆధారంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం మరింత ఆందోళనకరంగా మారింది. కాబట్టి మీకు వచ్చే కాల్స్, మెసేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. పీఎం కిసాన్ విషయానికొస్తే.. ఈ పథకాన్ని 2019 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటినుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6 వేల రూపాయలు ఇస్తున్నారు. దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీం ద్వారా లబ్ది పొందుతున్నారు. మొత్తం మూడు విడతలుగా ఈ 6 వేల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. ఏప్రిల్- జులై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్- మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 18 విడతల డబ్బు రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 19 ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బు కొత్త సంవత్సర కానుకగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

 

ఫోన్ సర్వీస్‌కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! డేటా రక్షణపై కీలక సూచనలు!

 

ఎస్‌బీఐ కీలక ప్రకటన! లోన్లపై కొత్త వడ్డీ రేట్లు! ఇవాళ్టి నుంచే అమల్లోకి!

 

ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!

 

గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..

 

వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

 

మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

 

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli