ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్! బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు!

Header Banner

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్! బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు!

  Thu Jan 16, 2025 12:36        Politics

బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్‌ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అంతకుముందు.. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్‌ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

 

ఇంకా చదవండి: మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం.. టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ! వారిపై కేసు నమోదు!

 

‘ఫార్ములా రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్‌ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్‌, నిబద్ధత, హైదరాబాద్‌ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.46 కోట్లు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి నయా పైసాకూ లెక్క ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్‌ ఎక్కడ ఉంది?. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతున్నది. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ అని కేటీఆర్‌ అన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

 

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

 

నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

 

ఫోన్ సర్వీస్‌కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! డేటా రక్షణపై కీలక సూచనలు!

 

ఎస్‌బీఐ కీలక ప్రకటన! లోన్లపై కొత్త వడ్డీ రేట్లు! ఇవాళ్టి నుంచే అమల్లోకి!

 

ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!

 

గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..

 

వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

 

మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

 

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KCR #Posters #BRS #Congress