ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

Header Banner

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  Fri Jan 17, 2025 07:00        Politics

ఏపీ వాసులకు గుడ్ న్యూస్. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం సిద్ధమైనట్టు. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆర్థిక ప్యాకేజీపై ఈరోజు అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానిని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెచ్చారు. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. ఇక ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువడితే సంస్థతో పాటు ఉద్యోగుల ఆర్థిక కష్టాలు తొలగినట్టే. నాలుగు నెలలుగా జీతాలు లేవంటూ విశాఖ ప్లాంట్ అధికారుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను కలిశారు. వితంతువులకు పెన్షన్లు కూడా అందడం లేదని సీఎస్‌కు వినతి పత్రం అందజేశారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: అదే నా గోల్.. నిరంతరం పనిచేస్తా.. గతంలో తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే!

 

విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రభుత్వం తక్షణమే చేయవలసిన సాయం గురించి సీఎస్‌ను కోరారు. పెద్ద ఎత్తున చేపట్టిన అమరావతి నిర్మాణానికి, పేదల ఇళ్లకు నాణ్యమైన విశాఖ ఉక్కును వినియోగించేలా చూడాలని కోరారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు రూ.500 కోట్లు చొప్పున నాలుగు నెలలు అడ్వాన్సుగా ఇచ్చేట్లు ఒప్పించాలని అభ్యర్థించారు. ఇక విశాఖ ఉక్కును కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని యోచిస్తోందని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవలే పేర్కొన్నారు. 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇటీవల కాలంలో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పేరుకుపోతున్న అప్పులు, కార్యకలాపాల నిర్వహణకు అడ్డంకులు, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురుగాలుల కారణంగా సంస్థ ఇక్కట్ల పాలైంది. అయితే, సంస్థను ఆదుకునేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని స్టీల్ సెక్రెటరీ సందీప్ పౌండ్రిక్ ఇటీవల జాతీయ మీడియాకు తెలిపారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్! బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు!

 

మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం.. టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ! వారిపై కేసు నమోదు!

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

 

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

 

నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli