ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై కఠిన చర్యలు? 20న క్రమశిక్షణ కమిటీ ముందు!

Header Banner

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై కఠిన చర్యలు? 20న క్రమశిక్షణ కమిటీ ముందు!

  Sat Jan 18, 2025 20:34        Politics

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. మహిళపై దాడి ఘటన నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి సోమవారం హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11న ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై కొలికిపూడి దాడి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. దాడికి సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలంటూ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొలికపూడి వ్యవహారంలో తిరువూరు ఘటనపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!



తాజాగా ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ మళ్లీ పెద్దఎత్తున విమర్శలు రావడంపై టీడీపీ అధిష్ఠానం విచారణకు ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ బృందం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోనుంది. జనవరి 11న ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు గోపాలపురం గ్రామానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వెళ్లారు. అనంతరం అన్నదమ్ములకు చెందిన ఓ స్థల వివాదం పరిష్కరించేందుకు వారి ఇంటి వద్దకు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా ఎమ్మెల్యే తనను దుర్భాషలాడి, దాడి చేశారంటూ స్థలానికి చెందిన మహిళ పురుగులమందు సేవించింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 



తమ కుటుంబంపై దాడి చేశారంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో హుటాహుటిన సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు. కాగా, తన సొంత నిధులతో పంట కాలువల పూడికలు తీయించానని, కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ రైతులకు ఉండదంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి. ఇలాంటి వరస ఘటనతో టీడీపీ అధిష్ఠానం ఆగ్రహానికి గురైంది. ఎమ్మెల్యేను విచారించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thiruvuru #mla #fire #todaynews #flashnews #latestupdate