ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

Header Banner

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

  Sun Jan 19, 2025 07:00        Politics

పథకాల్లో 3 రకాలుంటాయి. మొదటి రకం కేవలం మేనిఫెస్టోకి మాత్రమే పరిమితం అవుతాయి. అవి అమలవ్వవు. రెండో రకం.. ప్రభుత్వాలు భారీగా ప్రచారం చేస్తాయి. అమలు కూడా చేస్తాయి. కానీ వాటి ప్రయోజనం లబ్దిదారులకు కలగదు. పేరుకి అమలైనట్లు ఉంటాయేగానీ వాటితో ప్రయోజనం కలగదు. మూడో రకం.. మేనిఫెస్టోలో ఉంటాయి, అమలవుతాయి, ప్రయోజనాలు కూడా లబ్దిదారులకు కలుగుతాయి. అలాంటి ఒక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తెచ్చింది కానీ.. సరిగ్గా అమలు చెయ్యలేకపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం ఏంటంటే.. వైఎస్‌ఆర్‌ పశు నష్ట పరిహార పథకం. దీన్ని వైసీపీ ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. పాడి పశువులు చనిపోతే.. రైతులు నష్టపోకుండా.. ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలి అనేది ఈ స్కీమ్ ఉద్దేశం. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని వైసీపీ బాగా అమలు చేసింది. ఎక్కడెక్కడ పాడి పశువులు చనిపోయాయో గుర్తించి, వాటి యజమానుల బ్యాంక్ అకౌంట్లలో మనీ జమ చేసింది. ఆ తర్వాత 2020 సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కాలేదు. అప్పట్లో కరోనా రావడంతో.. ప్రభుత్వం మనీ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఈ పథకం అటకెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. మళ్లీ పాడి రైతులు.. అన్ని జిల్లాల్లో.. తమకు న్యాయం చెయ్యాలని కోరారు. ఇలాంటి పిర్యాదులు బాగా వస్తుండటంతో.. పాడి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో పాడి రైతుల అకౌంట్లలో మనీ జమ చేస్తోంది.

 

ఇంకా చదవండి: రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది!

 

ఈ డబ్బు కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. వైసీపీ హయాంలో ఎలాగైతే అకౌంట్లలో మనీ వచ్చిందో, ఇప్పుడూ అలాగే మనీ ఇస్తున్నారు. జాతి పశువు చనిపోతే రూ.30,000, సాధారణ పశువు చనిపోతే రూ.15,000 చొప్పున పరిహారం ఇస్తున్నారు. ఒక్కో జిల్లాలో వందల మందికి మనీ వస్తోంది. ఎవరైనా రైతులకు మనీ అకౌంట్లలోకి రాకపోతే.. వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. తమ జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులను కలవాలి. తమకు ఎన్ని పాడి ఆవులు, గేదెలు ఉన్నాయో, వాటిలో ఎన్ని చనిపోయాయో, ఎప్పుడు చనిపోయాయో, ఎందుకు చనిపోయాయో వివరించాలి. అప్పుడు ఆ శాఖ అధికారులు, పశు వైద్యులూ ఇవన్నీ పరిశీలించి.. మనీ వచ్చే ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వారంలోపే మనీ అకౌంట్లలోకి వస్తుంది. రాని వారి లిస్ట్ మళ్లీ తయారుచేసి పంపుతామని అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా మనీ రాని వారికి సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనీ ఇస్తోంది. తద్వారా ఆ డబ్బుతో రైతులు.. కొత్త పశువులు కొనుక్కుంటున్నారు. ఏపీలో పాల ఉత్పత్తిని బాగా పెంచాలనీ, న్యూజిలాండ్ తరహాలో.. పాల పదార్థాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రైతులు చేరాలని ప్రభుత్వం కోరుతోంది. ఏపీలో విజయ, హెరిటేజ్, సంఘం ఇలా చాలా పాల ఉత్పత్తి డెయిరీలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు పరిహారం ఇస్తోంది కాబట్టి.. మున్ముందు ఏపీలో పాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలున్నాయి. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews