డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..

Header Banner

డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..

  Wed Jan 22, 2025 13:06        Politics

మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ వరుసబెట్టి టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో... ఈ అంశం జనసేనలో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో టీడీపీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కేడర్ కు ఆదేశాలు జారీ చేసింది. జనసేన కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినా, పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు దావుస్ పర్యటనలో నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో లోకేశ్ ను ఓ జాతీయ మీడియా ఛానల్ పలకరించింది. లోకేశ్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో వస్తున్నాయని... మీ రాజకీయ లక్ష్యం ఏమిటని ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం .. డ్రైవర్, ముగ్గురు విద్యార్ధుల మృతి! హంపి క్షేత్రానికి వెళుతుండగా..

 

దీనికి సమాధానంగా... తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని లోకేశ్ చెప్పారు. ఎన్నికల్లో తమను ప్రజలు మంచి మెజర్టీతో గెలిపించారని... 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిచారని లోకేశ్ అన్నారు. ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉందని... తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ లపై ఫోకస్ చేశానని తెలిపారు. గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారయిందని... విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనే చంద్రబాబు విజన్ కోసం తామందరం పని చేస్తున్నామని తెలిపారు.

 

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!

 

జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!

 

నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!

 

నేడు (22/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..

 

రూ.10 వేల పెట్టుబడితో 17 ల‌క్ష‌ల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్‌!

 

జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

 

ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!

 

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting