సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి! సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఒంటెల కాపరి!

Header Banner

సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి! సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఒంటెల కాపరి!

  Sun Oct 06, 2024 20:21        Gulf News

కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ లతో పాటు గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌ వెళ్లాడు. అరబ్బు యజమాని అతన్ని కువైట్‌ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. యజమాని హింసను తట్టుకోలేకపోతున్నాను, నిత్యం నరకం అనుభవిస్తున్నాను, ఎడారి నుంచి నన్ను రక్షించండి అంటూ రాథోడ్ నాందేవ్ ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పంపిన ఒక సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. 

 

ఇంకా చదవండిఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు.. ప్రజా సంస్థ! చార్జింగ్ సౌకర్యాల కోసం అనేక చోట్ల! రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా!

 

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ జీఏడీ ఎన్నారై శాఖ అధికారులు, అనిల్ ఈరవత్రి తో కలిసి కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడి సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయము చేసి నాందేవ్ ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) బృందం కృషి అభినందనీయం.

 

WhatsApp Image 2024-10-05 at 2.45.31 PM.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants