దూసుకెళ్తున్న రిలయన్స్ షేర్లు! 3 నెలల్లోనే 2.67 లక్షల కోట్ల ఆదాయం!

Header Banner

దూసుకెళ్తున్న రిలయన్స్ షేర్లు! 3 నెలల్లోనే 2.67 లక్షల కోట్ల ఆదాయం!

  Fri Jan 17, 2025 11:28        Business

దేశంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ మళ్లీ పుంజుకున్నారు. ఆయన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3లో రికార్డు స్థాయిలో ఫలితాలు నమోదు చేసింది. రిటైల్ బిజినెస్ సహా టెలికాం ఆదాయాలు పెరగడంతో రిలయన్స్ కంపెనీ లాభం సమీక్షా త్రైమాసికంలో రూ. 18 వేల కోట్లకుపైగా, ఆదాయం రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లు పడుతున్నా స్టాక్ జనవరి 17న దూసుకెళ్తోంది. 

 

మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలు నమోదు చేసింది. 3 నెలల కాలంలో నికర లాభం 7.40 శాతం పెరిగి రూ. 18,540 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో లాభం రూ. 17,256 కోట్లుగానే ఉంది. ముఖ్యంగా రిలయన్స్ రిటైల్ బిజినెస్ పుంజుకోవడం సహా ఇంకా టెలికాం సెక్టార్ నుంచి కూడా ఆదాయాలు పెరగడం కలిసొచ్చింది. మరోవైపు.. సంస్థకు ప్రధానమైన చమురు- పెట్రోకెమికల్స్ బిజినెస్ కూడా స్థిరంగా ముందుకెళ్తుండటం సంస్థ రాణించేందుకు దోహదం చేసింది. ఇక కార్యకలాపాల ద్వారా సంస్థ ఆర్జించిన ఆదాయాలు సమీక్షా త్రైమాసికంలో 7.70 శాతం పెరిగి రూ. 2.67 లక్షల కోట్లకు చేరుకుంది.

 

ఇంకా చదవండిజగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో రిలయన్స్ రిటైల్ లాభం రూ. 3458 కోట్లుగా ఉండగా.. స్థూల ఆదాయం రూ. 90,333 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో చూస్తే వరుసగా 10, 8.75 శాతం మేర పెరిగాయి. ఇక జియో ఇన్ఫోకామ్ లాభం 24 శాతం మేర పెరిగి రూ. 6477 కోట్లకు చేరుకుంది. జియో కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది. వినియోగదారుడిపై సగటు ఆదాయం కూడా పెరగడంతో లాభాలు పెరిగాయి.

 

అయితే ఈ సమయంలోనే సంస్థ మంచి ఫలితాలు నమోదు చేసిన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా పుంజుకుంది. కొద్ది రోజుల కిందట భారీగా పడిపోయి రూ. 1201.50 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్.. మళ్లీ ఫలితాలకు ముందు నుంచి పుంజుకుంటోంది. ఇక ఇప్పుడు మంచి ఫలితాలు నమోదు చేసిన క్రమంలో స్టాక్ సెషన్ ఆరంభంలో బాగా పుంజుకుంది. ఇంట్రాడేలో దాదాపు 4 శాతం లాభంతో రూ. 1326 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ కూడా దిగొస్తోంది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో (ఉదయం 11 గంటలకు) రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 1.50 శాతానికిపైగా పెరిగి రూ. 1286 లెవెల్స్‌లో ఉంది.

 

షేరు పుంజుకుంటున్న తరుణంలో కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు రూ. 17.40 లక్షల కోట్ల వద్ద ఉంది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 1608.80 వద్ద ఉండగా.. కనిష్ట ధర రూ. 1201.50 గా ఉంది. గత 5 రోజుల వ్యవధిలో ఈ స్టాక్ 4 శాతానికిపైగా పెరగ్గా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పుంజుకుంది. గత 6 నెలల్లో చూస్తే 18 శాతానికిపైగా స్టాక్ పడిపోవడం గమనార్హం. ఇక సానుకూల ఫలితాల నేపథ్యంలోనే పలు బ్రోకరేజీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ టార్గెట్ ప్రైస్ పెంచేస్తున్నాయి. బై రేటింగ్ ఇస్తున్నాయి. ఏదేమైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి!

 

18న ఏపీకి అమిత్ షా... రెండు రోజుల పర్యటన! అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత!

 

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #Stocks #StockMarkets #MarketCrash