రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆర్‌బీఐ యాక్షన్! 10 ఫైనాన్స్ కంపెనీల లైసెన్స్‌ రద్దు!

Header Banner

రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆర్‌బీఐ యాక్షన్! 10 ఫైనాన్స్ కంపెనీల లైసెన్స్‌ రద్దు!

  Fri Jan 17, 2025 14:29        Business

మన దేశంలోని బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నియంత్రణాధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే. నియమ, నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులకు భారీ జరిమానాలు విధిస్తోంది. కొత్త సంవత్సరంలో దీనిపై ఆర్బీఐ ఫోకస్ మరింత పెంచింది. రూల్స్, రెగ్యులేషన్ ఫాలో అవ్వని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై వేటు వేసింది. ఏకంగా 10 NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లైసెన్స్‌లను రద్దు చేసింది. ఈ కంపెనీలన్నీ పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. 

 

అలాగే ఏడు ఇతర కంపెనీలు వివిధ కారణాలతో తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను స్వచ్ఛందంగా సరెండర్ చేశాయి. ఆర్‌బీఐ చర్యలు తీసుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రభావం గురించి చూద్దాం. 

 

జనవరి 9న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, రిజర్వ్‌ బ్యాంక్‌ 10 NBFCల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీలు ఇకపై బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలుగా పనిచేయవు. వ్యాలిడ్‌ CoR లేకుండా, ఈ కంపెనీలు ఫైనాన్షియల్‌ బిజినెస్‌ నిర్వహించలేవని, నిషేధం విధిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 

 

ఇంకా చదవండి'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్! 

 

లైసెన్స్‌లు రద్దు అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇవే:

- ఈస్ట్ ఇండియా లీజింగ్ కంపెనీ లిమిటెడ్

- కకరనియా ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్

- ఏకదంత్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్

- గోల్డ్ స్టార్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్

- సైబర్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

- జీత్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్

- బావిసన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్

- ఎక్స్‌పాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్

- జేఎం టెక్స్‌టైల్ ప్రైవేట్ లిమిటెడ్

- జ్యోతి వికాస్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఫైనాన్షియల్‌ బిజినెస్‌ నుంచి నిష్క్రమించడం లేదా నిర్దిష్ట నియంత్రణ ప్రమాణాలను పాటించడం వంటి వివిధ కారణాలతో ఏడు కంపెనీలు తమ CoRలను స్వచ్ఛందంగా సరెండర్ చేశాయి. ఈ లిస్టులో ఉన్న సంస్థలు ఇవే.

ఢిల్లీ ఆధారిత కంపెనీలు:

- స్ట్రైకర్ ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్

- నరీంద్ర సింగ్ & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్

- మోంట్‌గోమేరీ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్

- శ్రీ మహాలక్ష్మి ఇన్వెస్ట్‌మెంట్ & ప్రాపర్టీ కో. ప్రైవేట్ లిమిటెడ్ 

 

ఇతర కంపెనీలు:

- టిన్నా ఫైనాన్స్ లిమిటెడ్, న్యూఢిల్లీ(అన్‌రిజిస్టెర్డ్‌ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలకు షరతులను నెరవేర్చిన తర్వాత సరెండర్ చేసింది)

- రామ్‌కామ్ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై

- ఎస్‌ఎస్‌డీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతా

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి!

 

18న ఏపీకి అమిత్ షా... రెండు రోజుల పర్యటన! అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత!

 

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #RBI #Banks #NBFC