వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!

Header Banner

వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!

  Thu Jun 13, 2024 08:38        Education, Others

వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరుతుండడంతో అదనంగా ఒక రోజు సెలవు వచ్చింది. పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

ఇంకా చదవండి: నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!

 

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ ప్రకారం, మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫారంతో పాటు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, విద్యా కానుకను పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

 

ఇంకా చదవండి: కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?

 

రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలు నేడు ప్రారంభమవుతాయి. కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి.

 

ఇంకా చదవండి: నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!

 

నారా చంద్ర బాబు అనే నేను! మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!

 

జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!

 

పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!

 

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

TG TET-2024 ఫలితాలు విడుదల! అర్హత సాధించిన వారికి ఉచిత DSC దరఖాస్తు!

 

AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:    

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #AndhraPradesh #SchoolReopening #Education #BackToSchool #APStudents #NewAcademicYear #StudentWelfare #EducationFirst