నీట్ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌లపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌! ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Header Banner

నీట్ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌లపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌! ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

  Tue Jun 18, 2024 08:18        Education

నీట్‌ పేప‌ర్ లీక్ అయ్యిందంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న వేళ సీబీఐ మాజీ జేడీ, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశ‌నం చేయాలంటే ఆట‌మ్ బాంబులు అవ‌స‌రం లేదు. నాసిర‌కం విద్య‌, విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌నివ్వ‌డం లాంటి విధానాల‌ను ప్రోత్స‌హిస్తే ఆ దేశం దానంత‌ట అదే నాశ‌నం అవుతుంది. అలా చ‌దివిన డాక్ట‌ర్ల చేతిలో రోగులు చ‌నిపోతారు అంటూ ప‌లు ఉదాహరణలను  ఓ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌ రాశార‌ని పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీక‌రించారు. నీట్‌ అక్రమాలు గుజరాత్‌, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది.

 

ఇవి కూడా చదవండి 

భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

 

నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్! 

 

టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్! 

 

మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు! 

 

ఈవీఎంలు ఎలా హ్యాక్ చేస్తారో ఎలాన్ మస్క్ నిరూపించాలి! పురందేశ్వరి కామెంట్స్! 

 

రేపు రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన! ముఖ్యంగా ఆ జిల్లాల్లో! 

 

ఇకపై ఆ రోడ్డు లో ఎలాంటి ఆంక్షలు ఉండవు! అందరికీ అందుబాటులో! 

                                                                                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Education #NEET #NEETPaper #NEETPaperLeak #India