వెడ్డింగ్ రెన్యువల్! సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్న నయా ట్రెండ్!

Header Banner

వెడ్డింగ్ రెన్యువల్! సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్న నయా ట్రెండ్!

  Fri Nov 15, 2024 12:44        Life Style

ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే ఒక అందమైన వేడుక పెళ్లి. వివాహం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు రెండు కుంటుంబాలను కలిపే పవిత్ర బంధం. భారతీయ పెళ్లిలో పాతికేళ్లకు పెళ్లి, అరవయేళ్లకు షష్టిపూర్తి. కానీ, ప్రస్తుత రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే రెండో పెళ్లి. రెండో పెళ్లి అంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కాదు. తమ భాగస్వామినే రెండోసారి పెళ్లి చేసుకోవడం. దీన్నే 'వెడ్డింగ్ రెన్యువల్' అని పిలుస్తున్నారు. అయితే, ఈ ట్రెండ్నే ఇప్పుడు బాలీవుడ్ హాట్ కపుల్ సన్నీ లియోని, డేనియన్ వెబర్ ఫాలో అయ్యారు. పదమూడేళ్ల తర్వాత మాల్దీవుల్లో వారి పిల్లల ముందు మళ్లీ పెళ్లి చేసుకుని ఈ ట్రెండ్ వైరల్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఉంటాయి. వాటన్నింటిని దూరం చేయడానికి ఈ వెడ్డింగ్ రెన్యువల్ పద్ధతి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

మళ్లీ పెళ్లి ఎందుకు? ఈ ఆధునిక యుగంలో కొత్తగా పెళ్లి అయిన జంట మధ్య ప్రేమానురాగాలు.. ఏళ్లు గడిచే కొద్ది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇది సహజమైన విషయం. అయితే, ఈ చిన్న చిన్న విషయాలకే చాలామంది విడిపోతుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు. దీని వల్ల ఇద్దరి జీవితాలు మాత్రమే కాదు.. రెండు కుంటుబాలు బాధపడాల్సి వస్తుంది. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇలా ఎలాంటి కారణాలు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య తగ్గిన ప్రేమ, అనుబంధాన్ని తగ్గించుకునేందుకు ఈ 'వెడ్డింగ్ రెన్యువల్’ సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అయితే, జీవిత భాగస్వామిని మళ్లీ పెళ్లి చేసుకుంటే.. తొలి పెళ్లి నాడు చేసుకున్న ప్రమాణాలు ఒకసారి గుర్తు చేసుకుని, ఇప్పటి వరకు తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనలన్నీ మర్చిపోయి.. తిరిగి కొత్త జీవితం ప్రారంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వెడ్డింగ్ రెన్యువల్ వల్ల లాభాలు: జీవిత భాగస్వామిని రెండో పెళ్లి చేసుకోవడం వల్ల గతంలో జరిగిన గొడవలు, అపార్థాలు, ఆరోగ్యసమస్యలు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎవరి జీవితంలో అయిన పుట్టిన రోజు, పెళ్లి రోజు చాలా ప్రత్యేకం. ఈ క్రమంలోనే ఓ మంచి డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటే.. అది మీ జీవితంలో ఓ మధురానుభూతిగా నిలిచిపోతుంది. ఏళ్లు గడిచే కొద్దీ వివాహ బంధంలో బోరు కొడుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఈ రెండో పెళ్లి.. మీ వైవాహిక జీవతంలో కొత్త మార్పును తీసుకొస్తుంది. పెళ్లిరోజు చేసుకున్న ప్రతిజ్ఞలు.. ఈ వెడ్డింగ్ రెన్యువల్ ద్వారా మరొసారి గుర్తు చేసుకున్నట్లు అవుతుంది. వీటితోపాటు ఒకరినొకరు గౌరవించుకోవడం, వారితో ఎక్కువ సమయం గడపడం, అన్ని పారదర్శకంగా వ్యవహరించడం వంటివి మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

  

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Marriage #MarriageRenewal