విద్యార్ధులకు ఏపీ మంత్రి గుడ్ న్యూస్! ఇకపై ఆ సమస్య ఉండదు కీలక అంశాలు జారీ!
Fri Nov 15, 2024 13:15 Politicsప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్ఐవోలు, జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, ఐదు రీజినల్ సెంటర్లలోని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి..?
ఇంకా చదవండి: ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!
ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి..? పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై మంత్రి నారాయణ అధ్యాపకులకు సూచనలు చేశారు. గతేడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్ధులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ... మార్కులు తగ్గడానికి గల కారణాలేంటని ఆరా తీసారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని...దానికి తగ్గట్లుగానే విద్యార్ధులకు అవసరమైన విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. ఈ ఏడాది ఈఏపీసెట్ రాసే విద్యార్ధులకు నారాయణ విద్యాసంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తానని చెప్పారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.