వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!
Tue Dec 31, 2024 07:00 Politicsఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్యనేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా గంజి చిరంజీవి, జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల వైసీపీని ఇరువురు నేతలు వీడారు. డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షంలో ఇరువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీలో చేరారు.
ఇంకా చదవండి: ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!
పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ ఇరువురు నేతకు ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణ పని చేశారు. ఆయన కైకలూరుకు చెందిన నేత. వెంకటరమణ వైసీపీని వీడటంతో కైకలూరులో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరో నేత గంజి చిరంజీవి ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేసి మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు. తాజాగా, ఆ పార్టీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలడంతో కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు. గత కొంత కాలంగా వైసీపీపై, పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి వైఖరీని బాహాటంగానే నేతలు విమర్శిస్తున్నారు.ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మరికొందరు నేతలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రాజీనామాలు ఉంటాయని సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలియవచ్చింది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!
జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!
మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!
87 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన భారత్, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్! ఐదు రోజుల్లో..
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరణ! విద్యా రంగంలో కొత్త దశ!
మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!
గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!
ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Jagan #AndhraPradesh #YCPOffice #Notes #APNews #APpolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.