జపాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం! 2 విద్యుత్ ప్లాంట్లకు నష్టం!

Header Banner

జపాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం! 2 విద్యుత్ ప్లాంట్లకు నష్టం!

  Mon Jun 03, 2024 11:32        Environment

సెంట్రల్ జపాన్లో సోమవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 6:31 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం నోటో ద్వీపకల్పంలో కేంద్రీకృతమై ఉన్నట్టు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. నోటో ద్వీపకల్పంలోని ఉత్తర కొనపై 5.9 తీవ్రతతో మొదటి ప్రకంపన, అనంతరం మరో పది నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్టు తెలిపింది. అయితే రెండు భూకంపాల వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలు ఏమీ లేవని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రకంపనల అనంతరం సమీపంలోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లలో స్వల్ప నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. నోటో ద్వీపకల్పంలోని షికా ప్లాంట్, కాషివాజాకి-కరివా అణు కర్మాగారంలో తనిఖీ చేయడానికి కార్యకలాపాలు నిలిపివేసినట్టు వెల్లడించారు. అయితే జనవరి 1న ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 241 మంది మరణించారు. అనేక మంది నివాసితులు ప్రభావితమయ్యారు. జపాన్ సముద్ర తీర ప్రాంతంలోని అనేక భవనాలు గతంలో శక్తివంతమైన జనవరి భూకంపం, దాని అనంతర ప్రకంపనలలో దెబ్బతిన్నాయి. దాదాపు 125 మిలియన్ల ప్రజలు నివసించే ఈ ద్వీపసమూహం ప్రతి ఏటా అనేక భూకంపాలను ఎదుర్కుంటుంది. ఇది ప్రపంచంలోని భూకంపాలలో 18 శాతం వాటాను కలిగి ఉంది.

 

ఇవి కూడా చదవండి: 

యూఏఈ: అబుదాబి లో విమాన ప్రయాణికులకు శుభవార్త! తగ్గిన పార్కింగ్ ఫీజులు! 

 

యూఏఈ: ఉన్నత విద్యకు పెరుగుతున్న డిమాండ్! టాప్ 14 చౌకైన యూనివర్సిటీలు! అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు! 

 

కువైట్: కొత్త యువరాజుగా షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా! గతంలో విదేశాంగ శాఖ మరియు ప్రైమ్ మినిస్టర్ గా! మీడియాకు వెల్లడించిన రాజు! 

 

రోజురోజుకీ మితిమీరుతున్న కిమ్ ఆగడాలు! దక్షిణ కొరియా లోకి 600 చెత్తతో నిండిన బెలూన్లు విడుదల! భయంతో స్థానికులు! 

 

ఆలస్యమైన విమానం... దానికి పరిహారం! 29 వేల వోచర్! ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం! 

 

ప్రపంచంలోనే అత్యంత అల్లకల్లోల వాతావరణం (టర్బ్యులెన్స్) ఉండే విమాన మార్గాలు! ఈ 5 బాగా డేంజరస్! సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాదం అందుకే! 

 

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా! 

 

ప్రపచవ్యాప్తంగా అత్యుత్తమ బడ్జెట్ ఎయిర్ లైన్స్! ఇండియాకు సంబంధించి! 

 

భారత్ నుండి యూఏఈ వెళ్తున్నారా! అయితే ఇది మీ కోసమే! సేమ్ ఎయిర్ లైన్లో రిటర్న్ టికెట్ తప్పదు! 

 

ఢిల్లీ-వారణాసి విమానంలో బాంబు బెదిరింపుపై సమీక్ష! ఆరుగురు సిబ్బందిని తొలగించిన ఇండిగో! కారణం తెలిస్తే అవాక్కవుతారు! 

 

భావోద్వేగంతో - ABV అధర్మాన్ని ఎదుర్కోవటమే వృత్తిగా! చట్టాన్ని కాపాడేందుకే కృషి! లక్షల మంది అభిమానంతో, పూర్తి సంతృప్తితో...

 

మాస్కోకు భారీగా పెరుగుతున్న భారతీయ పర్యాటకులు! మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్న రష్యా ప్రభుత్వం! గత సంవత్సరంతో పోలిస్తే! 

              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Environment #Nature #World #Earthquake #Japan #JapanEnvironment