ప్ర‌భాస్ అభిమానుల‌కు షాక్‌! కల్కి సినిమా టికెట్ ధరలు పెంపు! ఆ వివరాలు మీకోసం!

Header Banner

ప్ర‌భాస్ అభిమానుల‌కు షాక్‌! కల్కి సినిమా టికెట్ ధరలు పెంపు! ఆ వివరాలు మీకోసం!

  Mon Jun 24, 2024 15:49        Cinemas

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన క‌ల్కి సినిమా మ‌రో మూడురోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమా రీలీజ్‌కు ముందే ప్ర‌భాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. క‌ల్కి సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచేసారు. ఇప్పుడు కల్కి సినిమా ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్‌ షోలు వేసుకునేందుకు తెలంగాణ‌ రాష్ట్ర హోంశాఖ అనుమ‌తినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జితేందర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 27 నుంచి జూలై 4 వరకు మొత్తం ఎనిమిది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వెసులుబాటు కల్పించింది.

 

 ఇంకా చదవండి: ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ నిర్మాతలు! సాయంత్రం పవన్‌తో భేటీ!

 

ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ స‌ర్కారు కల్కి సినిమా టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 వరకు పెంచుకోవచ్చని వివ‌రించింది. వీటితోపాటు జూన్ 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. వారం రోజులపాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన టిక్కెట్ రేట్‌ల‌ను బ‌ట్టి చూస్తే.. బెనిఫిట్ షోల రేట్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల‌లో రూ.377 ఉండ‌గా, మల్టీప్లెక్స్‌ల‌లో రూ.495 గా నిర్ణ‌యించారు. బెనిఫిట్ షో త‌ర్వాత‌ రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల‌లో రూ.265 ఉండ‌గా.. మల్టీప్లెక్స్‌ల‌లో రూ. 413 ఉండనుంది. వీటితోపాటు ఆన్ లైన్ లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉండ‌నున్నాయి. దీనిని బట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించి ఉంటుంది. ఇదిలా ఉండ‌గా, తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ టికెట్ ధర‌లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది..

 

ఇంకా చదవండి: స్పీకర్ అయ్యన్న పాత్రుడి జీవితాన్ని చాలా గొప్పగా వివరించిన సీఎం చంద్రబాబు! పదవి ఇచ్చినా వన్నె తెస్తారని ప్రశంసలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయ‌డంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actor #NewMovie #TicketRate #AndhraPradesh #Telangana #Kalki