లైట్ ఆన్ చేయడమే ఉద్యోగం! జీతం మాత్రం రూ. 30 కోట్లు! ఎక్కడో తెలుసా!

Header Banner

లైట్ ఆన్ చేయడమే ఉద్యోగం! జీతం మాత్రం రూ. 30 కోట్లు! ఎక్కడో తెలుసా!

  Wed Sep 18, 2024 13:51        Europe

జీవితంలో సంతోషంగా బతకాలంటే కావాల్సిన కనీస అవసరాల్లో ఉద్యోగం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల జాబ్స్ ఉన్నప్పటికీ, నిరుద్యోగం కూడా ఉంటోంది. అందుకే కొన్నిసార్లు తక్కువ జీతమైనా సరే చేస్తామంటూ ముందుకొచ్చేవారు చాలా మందే ఉంటారు. నెలకు రూ. 15 నుంచి 30 వేల సాలరీ వచ్చినా సరే ఒక్కోసారి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఒక దగ్గర రూ.30 కోట్లు ఇస్తామంటే కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కారణాలేమిటో చూద్దాం.

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అంతపెద్ద మొత్తంలో సాలరీ ఇస్తారంటే.. డ్యూటీ ఏ దట్టమైన అడవుల్లోనో అయి ఉంటుందని అనుకుంటే పొరపాటే.. అలాంటిదేం లేదు. అయినా జనాలు భయపడుతున్నారు. కారణం ఏంటంటే.. ఆ ఉద్యోగం చేయాల్సిన ప్లేస్ ఈజిప్ట్ సముద్రంలోని పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలోని ఫారోస్ లైట్ హౌస్. ఇక్కడ ఎల్లప్పుడూ లైట్ ఆన్లోనే ఉండేలా చూసుకోవడానికి, అవసరమైతే స్విచ్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ఉద్యోగి కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇంతకు మించి అక్కడ మరోపని ఉండదు. అలా చేయాలని, ఇలా చేయకూడదని కూడా ఎవరూ ఒత్తిడి చేయరు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఫోన్లు కూడా చేయరు. జీతం మాత్రం ఏడాదికి రూ.30 కోట్లు తప్పకుండా ఇస్తారు. అయినా ఎవరూ ఆసక్తి చూపట్లేదు. వర్క్ ప్లేస్ సముద్రం మధ్యలో ఉండటం, రాత్రింబవళ్లు లైట్ ఆగిపోకుండా చూసుకునే ఉద్యోగి తప్ప ఇంకెవరూ అక్కడ ఉండకపోవడమే ఇందుకు కారణం. పైగా సముద్రపు అలలు ఎగసి పడుతుంటాయి. ఒక్కోసారి హోరు గాలులు వీస్తుంటాయి. భయం వేసినా, సంతోషం అనిపించినా చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. అంటే ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. దీంతో సంవత్సరానికి రూ.30 కోట్లు ఇస్తామన్నా ఆ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు.

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలోని ఫారోస్ లైట్ హౌస్ అక్కడ చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సముద్రంలోని ఈ ఏరియాకు నౌకలు రాకుండా వార్నింగ్ సిగ్నల్ ఇచ్చేందుకు దానిని నిర్మించారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయిని, అందుకోసం నౌకలు ఆ వైపు వస్తే డ్యామేజ్ అవుతాయని చెప్తుంటారు. ఈ హెచ్చరిక జారీకోసమే అక్కడ లైట్ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ అది నీళ్లల్లో మునిగిపోతుందనే భయం కూడా లేదు. అలా జరిగే అవకాశం ఉంటే సముద్రయాన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని కాపాడుతారు. కాకపోతే ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే ఆ ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఖాళీగానే ఉందని, ఒక ఎంప్లాయి వెంటనే కావాలని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. పలువురు క్యూరియాసిటీతో రకరకాలుగా స్పందిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Europe #Egypt #Employment #Job