శ్రీశైలంలో యాత్రికుల ట్రాఫిక్ కష్టాలు! 4 కి.మీ నిలిచిపోయిన వాహనాలు!

Header Banner

శ్రీశైలంలో యాత్రికుల ట్రాఫిక్ కష్టాలు! 4 కి.మీ నిలిచిపోయిన వాహనాలు!

  Sat Aug 03, 2024 22:32        Travel

శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుండి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుండి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో శనివారం డ్యాం పది గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు నుండి 2,45,750 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 17,782 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 1,67,556 క్యూసెక్కుల (మొత్తం 4,33,088 క్యూసెక్కులు ) నీరు శ్రీశైలానికి విడుదల చేశారు.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

శనివారం సాయంత్రం వరకు రిజర్వాయర్‌లోకి 4,24,466 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరినట్లు శ్రీశైలం అధికారులు తెలిపారు. అదే విధంగా పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తులో తెరచి 4,61,560 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,761 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్‌ రిజర్వాయర్‌కు విడుదల చేశారు.

 

ఇంకా చదవండిఆస్తి రూ.500 కోట్లు! రెమ్యునరేషన్ రూ.100 కోట్లు! ఇప్పుడు కారు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో టాలీవుడ్ హీరో! ఎవరో తెలిస్తే షాక్!

 

రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 882.50 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.807 టీఏంసీలకుగాను 202.0439 టీఏంసీలుగా నమోదైంది. అదేవిధంగా డ్యాం గేట్లు తెరవడంతోపాటు వారంతపు సెలవులు రావడంతో హైదరాబాద్‌ ఘాట్‌ రోడ్డు మొత్తం 4 కిలోమీటర్ల పైన ట్రాఫిక్‌ జాం సమస్యలు తలెత్తాయి. కృష్ణమ్మ పరవళ్ళ అందాలను చూస్తూ యాత్రికులు సెల్ఫీలు తీసుకుంటూ ఆనంద పరవశులవుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

  

రూ.లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దుఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

  

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

    

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతిపోలవరం తరువాతఅంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

  

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

      

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Travel #Srisailam #SrisailamDam #Tourists #Traffic