విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం! మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!

Header Banner

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం! మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!

  Sun Aug 04, 2024 13:35        Travel

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో పెనుప్రమాదం తప్పింది. విశాఖ స్టేషన్‌లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (Korba-Visakha Express) రైల్‌లో మూడు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క బోగీలకు కూడా వ్యాపించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. రైల్వే స్టేషన్‌ మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రైలు ఉదయం 7 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిందని అధికారులు తెలిపారు. మెయింటేనెన్స్‌ అనంతరం దానిని తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా వినియోగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఉదయం 10.10 గంటల సమయంలో రైలులోని జీ-7 బోగీలో మంటలు చెలరేగాయని, సిబ్బంది వాటిని ఆర్పేలోగా ఇతర బోగీలకు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్య్కూట్‌ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండి, ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

  

చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచేఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #Trains #Railways #IndianRailways #FireAccident #Visakhapatnam