ఎయిర్ ఇండియా పాత విమానాలకు కొత్త హంగులు! ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా!

Header Banner

ఎయిర్ ఇండియా పాత విమానాలకు కొత్త హంగులు! ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా!

  Tue Sep 17, 2024 17:15        Travel

ప్రపంచ విమానయాన సంస్థల్లో అగ్రగామిగా ఎదగాలని చూస్తున్న దేశీయ ఎయిర్లైన్ సంస్థ 'ఎయిర్ ఇండియా' తన పాత విమానాలను విలాసవంతమైన సీట్లు, ఆధునిక లైట్లు, ఇతర సదుపాయాలతో అప్గ్రేడ్ చేయడానికి సిద్ధమైంది. 67 పాత విమానాలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించింది. దీని కోసం దాదాపు రూ.3,350 కోట్ల ($400 మిలియన్ల)ను కేటాయించింది. మొదట 27 నారో బాడీ ఎయిర్బస్ A320neo విమానాలతో ప్రారంభించి, తర్వాత 40 వైడ్ బాడీ బోయింగ్ విమానాలను అప్గ్రేడ్ చేస్తారు. తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విడతల వారీగా విమానాలను అప్గ్రేడ్ చేసే పనిని మొదలు పెట్టంది.

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సీట్లు, కార్పెట్లు, కర్టెన్లు, అప్రోల్స్టరీలు, ఇతర క్యాబిన్ ఇంటీరియర్ ను ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఇచ్చే విధంగా మారుస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగు నారోబాడీ విమానాలను అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. 2025 మధ్య నాటికి పూర్తి నారోబాడీ ఫ్లీట్ అప్గ్రేడ్ పూర్తవుతుంది. మొదటగా A320neo ఎయిర్ క్రాఫ్ట్ను అప్గ్రేడ్ చేసే పనిని ప్రారంభించారు. దీనిలో బిజినెస్ క్లాస్లో ఎనిమిది లగ్జరీ సీట్లు ప్రీమియం ఎకానమీలో 24 అదనపు లెగ్రూమ్ సీట్లు, ఎకానమీలో 132 సౌకర్యవంతమైన సీట్లు, విశాలమైన లెగ్రూమ్, ఆధునిక లైటింగ్, చార్జింగ్ కోసం USB పోర్ట్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

అలాగే, ఎయిర్ ఇండియా తన 40 పాత వైడ్బాడీ బోయింగ్ 787, 777 విమానాల ఇంటీరియర్లను పూర్తిగా అప్గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే, మొదటి వైడ్బాడీ ఎయిర్క్రాఫ్ట్ 2025 ప్రారంభంలో అప్గ్రేడ్ పనులు ప్రారంభించవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #Travel #AirTravel #AirIndia #India #Airlines