సంక్రాంతికి ఊరికి వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! రైల్వే శాఖ కీలక ప్రకటన!

Header Banner

సంక్రాంతికి ఊరికి వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! రైల్వే శాఖ కీలక ప్రకటన!

  Thu Sep 19, 2024 11:28        Travel

సంక్రాంతి వచ్చిందంటే చాలు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా సొంతూళ్లకు క్యూ కడుతుంటారు. లక్షల మంది ఊళ్లకు బయల్దేరడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతాయి. టికెట్ దొరకడమే కష్టమైపోయింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే కనిపించాయి. వచ్చే ఏడాది జనవరి 11, 12, 13 తేదీల్లో నగరాల నుంచి రైళ్లలో ఏపీకి వెళ్లాలంటే టికెట్లు లేవు. సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ ఫుల్అయ్యాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లో అయిపోయాయి. ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ లు భారీగా పెరిగిపోతోంది. దీంతో ఊళ్ల నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్న వారు పండుగకు ఇంటికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు.

 

ఇంకా చదవండిమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే గరీబ్ రథ్, ఫలక్నమా, కోణార్క్, ఎన్టీటీ ముంబై, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ తో సహా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు విశాఖపట్నం వైపు జనవరి 10, 11, 12 తేదీల్లో ఫుల్ అయిపోయాయి. కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్ప్రెస్, ఎల్డీటీ- కాకినాడ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా సీట్లు ఖాళీ లేవు.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వీరందరికీ రైల్వే శాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమస్యపై స్పెషల్ స్పెషల్ ఫోకస్ పెట్టిన రైల్వే శాఖ. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు 4 నెలల ముందుగానే కీలక ప్రకటన చేసింది. అందుకే 2025 సంక్రాంతి కోసం 400 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించింది. ముందుగా అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని, ఒకవేళ అవికూడా సరిపోకపోతే.. 400 స్పెషల్ ట్రైన్లు నడపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో టికెట్లు బుక్చేసుకుందామంటే ‘నో టికెట్స్'అని వస్తోంది. వెయిటింగ్ లిస్ట్ రిగ్రేట్ స్టేటస్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్ట్ ను తగ్గించేందుకు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాన్చేస్తున్నారు. అప్పటికీ సరిపోకపోతే 400 స్పెషల్ సర్వీసులు నడపాలని యోచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama