మరికాసేపట్లో తెరుచుకొనున్న పూరీ జగన్నాధుడి రహస్య గది! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉత్కంఠ!

Header Banner

మరికాసేపట్లో తెరుచుకొనున్న పూరీ జగన్నాధుడి రహస్య గది! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉత్కంఠ!

  Sun Jul 14, 2024 14:05        Devotional

ఒడిశా పూరీలోని జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ తెరుచుకోనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని ఓపెన్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనిని తెరచిన తర్వాత ఆలయంలోని అభరణాలు, ఇతర విలువైన వస్తువులను లెక్కించనున్నారు. 16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ పూరీలోని జగన్నాథ ఆలయ ఖజానాను తెరవాలని సూచించింది. ఆలయ రత్నాల దుకాణాలపై విచారణ జరిపి, అక్కడ ఉంచిన నగలు, విలువైన వస్తువులపై ఆడిట్ చేయాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే దానిని జూలై 14న తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రత్న భండార్ లోపల విలువైన వస్తువులను స్పష్టంగా చూసేందుకు వీలుగా తగిన లైటింగ్ ఏర్పాట్లు చేశారు. 'రత్న భండార్ ను తిరిగి తెరవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉన్నాం' అని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వెన్ వెల్లడించారు. కాగా, జగన్నాధుడి రత్నభాండాగారంను 46 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడం గమనార్హం. దీనిని చివరి సారిగా 1978లో తెరిచారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

46 ఏళ్ల తర్వాత పూరిలోని రత్న భాండాగారాన్ని రీ ఓపెన్ చేయనుండటంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. 1978 తర్వాత ఈ భాండాగారాన్ని తెరవలేదు. తిరిగి 46 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఓపెన్ చేస్తున్నారు. అయితే, ఇన్నేళ్లు ఈ భాండాగారాన్ని ఎందుకు తెరవలేదు..? అసలు దీంట్లో ఏం ఉన్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. అప్పట్లో ఒడిషాను పాలించిన రాజులు విలువైన వజ్రాలు, నగలు, అభరణాలను ఈ భాండాగారంలో దాచిపెట్టినట్లు వినికిడి. మొత్తం ఐదు పెట్టేల్లో జగన్నాథుని వెలకట్టలేని అత్యంత విలువైన వజ్రవైడూర్యాలను ఈ భాండాగారంలో భద్రపరిచారు. గతంలో వజ్రాలు భద్రపర్చిన ఈ సీక్రెట్ రూమ్ను అధికారులు అప్పుడప్పుడు ఓపెన్ చేసి సంపదను లెక్కించేవారు.

 

ఇంకా చదవండి: రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!

 

అయితే, 1978 నుండి వివిధ కారణాల చేత ఈ భాండాగారం మూసివేసే ఉంది. లాస్ట్ టైమ్ 1978లో భాండాగారాన్ని ఓపెన్ చేసి అందులోని వజ్రాలను లెక్కించగా 70 రోజుల సమయం పట్టింది. అయితే, అప్పుడు అన్ని వజ్రాలను లెక్కించకుండా కొన్నింటినీ వదిలేసినట్లు ప్రచారం జరుగుంది. దీనిపై రకరకాల చర్చలు, అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే భాండాగారం ఓపెన్ చేయాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు సైతం దాఖలు అయ్యాయి. పూరి భండాగారాన్ని ఓపెన్ చేయాలని 2018లో పురావస్తు శాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే, రహస్య గది తాళం చెవి లేదనే కారణంతో 2018లో భాండాగారాన్ని ఓపెన్ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో సీక్రెట్ రూమ్ ఓపెనింగ్ ఇష్యూ ఇటీవల జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ టర్న్ తీసుకుంది.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ ఈ అంశాన్ని టేకప్ చేసి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో సాక్ష్యత్తూ జగన్నాథుడికే రక్షణ లేదని విమర్శలు ఎక్కుపెట్టింది. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూరి భాండాగారాన్ని ఓపెన్ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ ఘన విజయం సాధించింది. హామీ ఇచ్చిన మేరకు పూరి రహస్య భాండాగారాన్ని తెరవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో 46 ఇయర్స్ తర్వాత సీక్రెట్ రూమ్ ఓపెన్ కాబోతుంది. ఇవాళ (ఆదివారం) భాండాగారాన్ని తెరవనున్నారు. ఈ రహస్య భాండాగారానికి నాగబంధం ఉందని ప్రచారం జరగడంతో అధికారులు ముందుగానే ప్రిపేర్ అయ్యి స్నేక్ క్యాచర్స్ ను సైతం రంగంలోకి దింపారు. ఒడిషా ప్రభుత్వం అపాయింట్ చేసిన 16 మంది కమిటీ సభ్యుల బృందం లోపలికి వెళ్లనుంది. 46 ఏళ్ల తర్వాత ఈ భాండాగారాన్ని ఓపెన్ చేయనుండటంతో అందులో నుండి ఏం బయపడుతాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

ఇవి కూడా చదవండి 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!

  

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ! 

    

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Devotional #Puri #JagannathTemple #PuriJagannath #PuriJagannathTemple #Odissa #India #Piligrims #Temples #Visitors