వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన! త్వరలో 5జీ సేవలు ప్రారంభం!

Header Banner

వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన! త్వరలో 5జీ సేవలు ప్రారంభం!

  Fri Jul 19, 2024 11:53        Technology

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ, 5జీసేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దీనిపై తాము ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంటీఎన్ఎల్ అప్పుల్లో ఉన్నందున.. దాని నిర్వహణ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్ కు అప్పగించామని ఆయన చెప్పారు. అయితే ఎంటీఎన్ఎల్ సావరిన్ బాండ్లు కొన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆ బాండ్ల వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బాండ్లకు పూర్తి హామీ, భద్రత ఉంటుందని సింధియా స్పష్టంచేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

టాటా తేజస్ నెట్ వర్క్స్, టీసీఎస్, ప్రభుత్వరంగ కంపెనీ సీడాట్లు కన్సార్టియంగా ఏర్పడి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ల కోసం 4జీ, 5జీ మౌలిక సదుపాయాలను రెడీ చేసే పనిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విదేశాల నుంచి టెలికాం టెక్నాలజీని అరువుకు తేవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. స్వదేశంలోనే టెక్ విప్లవానికి బీజాలు వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మనదేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలో తయారయ్యే 4జీ, 5జీ టెక్నాలజీని విదేశాలకు కూడా విక్రయించనున్నట్లు తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు! ఆ జిల్లాల్లో స్కూల్లకు సెలవు!

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Technology #Telecom #TelecomServices #BSNL #MTNL #India #Gadgets #CentralGovernment