ఆ విషయంలో అమెరికాను దాటేసిన భారత్! ఎంతైనా మన యువత చాలా గ్రేట్! హల్ చల్ అవుతున్న న్యూస్!

Header Banner

ఆ విషయంలో అమెరికాను దాటేసిన భారత్! ఎంతైనా మన యువత చాలా గ్రేట్! హల్ చల్ అవుతున్న న్యూస్!

  Sat Sep 07, 2024 09:00        Science

ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్‌లో 5G టెక్నాలజీ హవా నడుస్తోంది. ఇప్పటికే అభివృద్ది చెందిన దేశాలతో పాటు భారత్‌లో కూడా ఈ కనెక్టివిటీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో టెక్ కంపెనీలు ఇప్పుడు భారీ స్థాయిలో 5G స్మార్ట్‌ఫోన్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే సమయంలో వీటి అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పరంగా ఇండియా, అగ్రరాజ్యం అమెరికాను దాటేసింది. చైనా తర్వాత అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. భారత 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను షియోమీ, శామ్‌సంగ్, వివో వంటి బ్రాండ్లు అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈ కంపెనీలు తక్కువ ధరలోనే 5G స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు ప్రాచీర్ సింగ్ తెలిపారు. భారత్‌లో 5G హ్యాండ్‌సెట్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. బడ్జెట్ విభాగంలో 5G హ్యాండ్‌సెట్ల విక్రయాలు పెరగడంతో తక్కువ సమయంలోనే అధిక వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: అరుణాచల్ ప్రదేశ్‌లో కొమ్ము కప్ప! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? కొత్త జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు!

 

గ్లోబల్‌ మార్కెట్‌లో యాపిల్‌దే పైచేయి..

ప్రస్తుతం, 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనా వాటా 32 శాతంగా ఉంది. భారత్‌ 13% వాటాతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా 5G స్మార్ట్‌ఫోన్ల విక్రాయాల్లో 10% మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పడిపోయింది. బ్రాండ్ల పరంగా చూస్తే, యాపిల్ ప్రపంచ వ్యాప్తంగా 5G మార్కెట్‌కు అగ్రగామి సంస్థగా నిలిచింది. యాపిల్‌ కంపెనీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 25% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది.

5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 54 శాతం వృద్ధి..

నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానంలో శామ్‌సంగ్‌ గెలాక్సీ A సిరీస్, శామ్‌సంగ్‌ గెలాక్సీ S24 సిరీస్‌ ఫోన్లు 21% కంటే ఎక్కువ వాటాతో అత్యంత అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ల విభాగంలో రెండో స్థానంలో ఉన్నాయి. 2024 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌ 10 స్మార్ట్‌ఫోన్ల జాబితాలో యాపిల్‌, శామ్‌సంగ్‌ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో యాపిల్‌ మొదటి నాలుగు స్థానాలను దక్కించుకుంది. 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షియోమీ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం షిమోమీకి భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, షియోమీ భారత్‌లో మూడు అంకెల వృద్ధి రేటును నమోదు చేసింది. అదే సమయంలో యూరప్, చైనాలో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసింది. భారత్‌లో షియోమీ తర్వాత వివో సంస్థకు కూడా గణనీయమైన మార్కెట్‌ ఉంది. గ్లోబల్‌ మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గతంతో పోలిస్తే 54% వృద్ధి చెందాయి. ఇది మొదటిసారిగా 50% దాటింది. 5G స్మార్ట్‌ఫోన్లలో అందిస్తున్న ఫీచర్లు, అందుబాటు ధర కారణంగా వీటికి డిమాండ్‌ భారీగా పెరిగింది. ముఖ్యంగా 5జీ స్మార్ట్‌ఫోన్లలోని ఇంటర్నెట్‌ స్పీడ్‌, అడ్వాన్సుడ్‌ ఫీచర్ల కారణంగా 4జీ ఫోన్లను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకొని 5జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడ్డారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Iphone #India #USA